ఇది కచరా పాలనా నమూనా; పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా తెలంగాణా: బండి సంజయ్!!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజా క్షేత్రంలో ఎంగడుతున్న బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా వెళుతుందని విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా తెలంగాణ తయారవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.'

తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే 200 బేసిన్ పాయింట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్న బండి సంజయ్ ఇది 100% బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిందించడం సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు.

Bandi Sanjay comments on kcr

అంతకుముందు బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య వ్యత్యాసం చెప్పిన బండి సంజయ్ బిజెపికి దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. ఫ్యామిలీ లాస్ట్.. అని పేర్కొన్నారు. ఇది బిజెపి మంత్రం అన్నారు. అయితే బీఆర్ఎస్ స్లోగన్ మాత్రం వేరేలా ఉందని పేర్కొన్న బండి సంజయ్ వారికి కుటుంబం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్ .. పీపుల్ లాస్ట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఇది కచరాపాలన నమూనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కవితా రావు, చంద్రశేఖర రావు, రామారావు అంటూ కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. గత తొమ్మిది సంవత్సరాల పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని వారు మాత్రమే ధనవంతులుగా, బలవంతులుగా మారారని పేర్కొన్నారు. పేదలు, నిరుద్యోగులు మాత్రం కష్టాలు పడుతున్నారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+