వీఆర్ఏల కోసం కేసీఆర్ మెడలు వంచుతాం.. ఆత్మహత్యలు వద్దు, అండగా ఉంటామన్న బండి సంజయ్!!

తెలంగాణ రాష్ట్రంలో గత 51రోజులుగా వీఆర్ఏలు పే స్కేల్ అమలుచేయాలని నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 51 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న వీఆర్ఏలు ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంతో మంది వీఆర్ఏ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వీఆర్ఏలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బిజెపి వారికి అండగా ఉంటుందని బండి సంజయ్ తెలిపారు.

ఎంత మంది వీఆర్ఏలు చనిపోయినా కేసీఆర్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదు: బండి సంజయ్

ఎంత మంది వీఆర్ఏలు చనిపోయినా కేసీఆర్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదు: బండి సంజయ్

రాష్ట్రంలో గత 2 నెల్లలో ఏకంగా 29 మంది వీఆర్ఏలు చనిపోయినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని బండి సంజయ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచైనా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్ వీఆర్ఏ లను పట్టించుకున్న పాపాన పోలేదు: బండి సంజయ్

కేసీఆర్ వీఆర్ఏ లను పట్టించుకున్న పాపాన పోలేదు: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడతలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో పాదయాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ వీఆర్ఏల అంశాన్ని ప్రస్తావించారు. బండి సంజయ్ పాదయాత్రలో కొందరు వీఆర్ఏలు ఎదురై తమ గోడును వెళ్లబోసుకోగా... స్పందిస్తూ పై విధంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు.2 నెలల నుండి రాష్ట్రంలో వీఆర్ఏలు ఎండనక, వాననక సమ్మె చేస్తున్నారని, దాదాపు 29 మంది ఆ సమ్మెలోనే చనిపోయారని, కానీ కేసీఆర్ కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

కేసీఆర్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసింది

కేసీఆర్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసింది

కేసీఅర్ ప్రభుత్వం మొత్తం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటు వీఆర్వో, ఇటు వీఆర్ఏ ల జీవితాలతో ఆడుకుంటున్నారు అని ఆరోపించారు. వీఆర్ఏల్లో 95 శాతం మంది అత్యంత నిరుపేదలు... ఎస్సీ, ఎస్టీ, బీసీలే అని బండిసంజయ్ పేర్కొన్నారు. అయినా స్పందించని మానవత్వం లేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. వీఆర్ఏలు అందరికీ స్కేల్ ప్రకారం జీతాలిస్తానని నిండు అసెంబ్లీలో రెండేళ్ల క్రితం హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పి వీఆర్ఏల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

వీఆర్ఏ ల కోసం కేసీఆర్ మెడలు వంచైనా పోరాటం చేస్తాం

వీఆర్ఏ ల కోసం కేసీఆర్ మెడలు వంచైనా పోరాటం చేస్తాం

వీఆర్ఏల పోరాటానికి బిజెపి మద్దతుగా ఉంటుందని, వీఆర్ఏలు ఎవరూ ధైర్యాన్ని వీడవద్దని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ మెడలు వంచి అయినా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజలందరినీ సమస్యలలోకి నెట్టి కెసిఆర్ జాతీయ రాజకీయాలు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు. జాతీయ రాజకీయలు తర్వాత ముందు వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని సూచించారు బండి సంజయ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+