హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్! సీఎం చేసింది అందుకేనా?: రైతులు ఎందుకు చనిపోతున్నారంటూ బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతుల కోసం రాళ్ల దాడులను కూడా భరిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ర్టంలో తాను చేస్తున్న పర్యటనల్లో జరుగుతున్న ఘర్షణలపై స్పందించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకే వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.

రైతులతో మాట్లాడుతుంటే దాడులు చేస్తారా?: బండి సంజయ్ ఫైర్

రైతులతో మాట్లాడుతుంటే దాడులు చేస్తారా?: బండి సంజయ్ ఫైర్

రైతులతో మాట్లాడుతుంటే రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని, 70మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని బండి సంజయ్ తెలిపారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై దాడులు జరిగినా స్పందించడం లేదన్నారు. రాళ్ల దాడిలో మీడియా వారికి సైతం గాయాలు అయ్యాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. తాము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే యాత్రలు చేస్తున్నామని, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా అధ్వానంగా ఉన్నాయని దీనికి ఖచ్చితంగా కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. రైతుల చేతిలో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా? రైతులు దాడులు చేస్తారా? అంటూ బండి సంజయ్‌ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్‌ కాళ్లు మొక్కిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని చెప్పడం కోసమే.. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు.

రైతులు చనిపోతున్నా.. ధాన్యం కొనరా?: కేసీఆర్‌పై బండి ఆగ్రహం

రైతులు చనిపోతున్నా.. ధాన్యం కొనరా?: కేసీఆర్‌పై బండి ఆగ్రహం

ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లను చేపడితే రైతులు వరి ధాన్యం కుప్పల మీద ఎందుకు చనిపోతున్నారని కేసీఆర్ సర్కారును బండి సంజయ్‌ నిలదీశారు. పశ్చిమబెంగాల్‌లో మూడు నుంచి 70కిపైగా సీట్లు సాధించామన్నారు. అవినీతి ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక మాట చెబితే వెంటనే అమలు కావాలి. వ్యవసాయ చట్టాలు భేష్ అన్నాడు. ఇప్పు డు ఏమో వ్యతిరేకిస్తాం అని అంటున్నారని మండిపడ్డారు. కల్లాల్లో ధాన్యం ఉంది.. దయచేసి కొనండి.. ఆరుగురు రైతులు చనిపోయారని సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్న బండి సంజయ్

రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్న బండి సంజయ్

కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ఒప్పందం కుదుర్చుకుంది. పాలమూరు రైతులు పక్క రాష్ట్రంలో అమ్ముకుం టున్నారు.. దానికి కారణం తామా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇది పార్టీల సమస్య కాదు, రైతుల సమస్య... కలిసి రైతులను ఆదుకుందామని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర సమస్యల పై పోరాటం చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తు న్నామన్నారు. రైతు బంధుతో ఎక్కువ అప్పులు అవుతున్నాయని రైతులు అంటున్నారు.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేయదు. ఇబ్బంది వస్తే కేంద్రం దగ్గరికి వెళ్తామని బండి సంజయ్‌ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేది కేంద్రం లక్ష్యమన్నారు. ప్రత్యామ్న్యాయ పంటలు వేయాలని.. పంట మార్పిడికి తాము వ్యతిరేకం కాదన్నారు.

Recommended Video

Sanjay Bangar named head coach of Royal Challengers Bangalore
కేసీఆర్.. సీఎంని చేసింది అందుకేనా?: బండి సంజయ్ ప్రశ్నని చేసింది అందుకేనా?: బండి సంజయ్ ప్రశ్న

కేసీఆర్.. సీఎంని చేసింది అందుకేనా?: బండి సంజయ్ ప్రశ్నని చేసింది అందుకేనా?: బండి సంజయ్ ప్రశ్న

సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడబోమన్నారు బండి సంజయ్. కేసీఆర్ హుందా తనాన్ని తగ్గించుకోవద్దని.. సీఎం పదవికి మచ్చ తీసుకురావొద్దన్నారు. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేసీఆర్ స్పందించకపోవడంతోనే తాము రైతుల దగ్గరకు వెళ్లామన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కొనుగోళ్లు సరిగా జరిగితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తమను వెంటాడుతానంటారా? అని అన్నారు. వేటాడటానికి ,రాళ్లతో కొట్టడానికేనా ముఖ్యమంత్రిని చేసిందని బండి సంజయ్ నిలదీశారు. ప్రజలను వెంటాడే.. వేటాడే ముఖ్యమంత్రి తమకు అవసరం లేదని అన్నారు.

English summary
Bandi Sanjay hits out at CM KCR for his comments on bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X