బండి సంజయ్ అరెస్ట్ - బాసర ఐఐటీకి వెళ్తుండగా : బీజేపీ కార్యకర్తల ఆందోళన..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా తల్లి తండ్రులు సైతం అక్కడకు వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని విద్యార్దులు తేల్చి చెబుతున్నారు. ఈ సమయంలో వారి అంశం పైన గవర్నర్ సైతం స్పందించారు. ఈ సమయంలోనే బండి సంజయ్ వారికి మద్దతుగా వెళ్లేందుకు బాసర బయల్దేరారు.
బీజేపీ నాయకుల వాహనాలను ముందుకు వెళ్లకుండా వలయంగా పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో..పార్టీ నేతలు - కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలను పోలీసులు అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకె ట్రిపుల్ ఐటీకి వెళుతున్నానని పోలీసులతో చెప్పారు. విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లేమైన తీవ్రవాదులా అంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా అంటూ నిలదీసారు.

సీఎం విద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సమస్యలు తెలుసుకోవాలని వెళితే అడ్డుకుంటారా అంటూ పోలీసుల పైన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులే... వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా అని నిలదీసారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామని స్పష్టం చేసారు. ట్రిపుల్ ఐటీ వెళ్లి తీరుతనని స్పష్టం చేసిన బండి సంజయ్ స్పష్టం చేసారు. దీంతో..పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీని పైన బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications