బండి సంజయ్‌ కాలికి గాయం-కార్యకర్తల తోపులాటలో పడిపోయిన నేత-గాయంతోనే మూడో రోజు పాదయాత్ర

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాలికి గాయమైంది. కార్యకర్తల తోపులాటలో సంజయ్ కింద పడిపోయారు. దీంతో ఆయన కుడి కాలికి స్వల్ప గాయమైంది. ఆదివారం(ఆగస్టు 29) హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ ప్రాంతంలో సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు పోటీ పడటంతో తోపులాట జరిగి... సంజయ్ అదుపు తప్పి కింద పడిపోయారు.

వెంటనే వైద్యులను పిలిపించగా... కాలి గాయమైన చోట ప్లాస్టర్ వేశారు.సోమవారం(ఆగస్టు 30) ఉదయం వైద్యులు మరోసారి సంజయ్ కాలి గాయాన్ని పరిశీలించారు. అనంతరం సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఇవాళ ఆయన 13కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. కాలికి గాయమైన నేపథ్యంలో ఆయన కాస్త నెమ్మదిగా నడుస్తున్నారు.

మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనని... కేసీఆర్ అలా...: బండి సంజయ్

మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనని... కేసీఆర్ అలా...: బండి సంజయ్

మూడో రోజు పాదయాత్రకు ముందు లంగర్ హౌస్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ మెడలు వంచేది బీజేపీ అని ప్రజలు భావిస్తున్నందువల్లే పాదయాత్రకు భారీ స్పందన కనిపిస్తోందన్నారు. ఈ స్పందన చూశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి అడుగుతున్నారని చెప్పారు. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే.. ఎక్కడ ప్రధాని మోదీకి పేరు వస్తుందోనని సీఎం కేసీఆర్ దాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంగా పేరు మార్చారని ఆరోపించారు.

కేంద్రం 2 లక్షల ఇళ్లు మంజూరు చేసినా... : బండి సంజయ్

కేంద్రం 2 లక్షల ఇళ్లు మంజూరు చేసినా... : బండి సంజయ్

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద 2లక్షల ఇళ్లు మంజూరు చేసిందన్నారు. దానికి సంబంధించి లబ్దిదారుల జాబితా ఇవ్వాలని అనేక సందర్భాల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల జాబితాను కేంద్రానికి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను ఇప్పటికీ ఎవరికీ కేటాయించినందువల్లే లబ్దిదారుల జాబితాను ఇవ్వలేకపోతున్నారని చెప్పారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యత గాలికి : బండి సంజయ్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యత గాలికి : బండి సంజయ్

ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో ప్రజలు నివసించే పరిస్థితి లేదని సంజయ్ అన్నారు. కేవలం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు పొందేందుకు తప్ప.. నాణ్యత విషయాన్ని పట్టించుకోవట్లేదన్నారు. కేవలం పబ్లిసిటీ కొరకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వాడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యతను పరిశీలించిన దాఖలా లేదన్నారు.మహారాష్ట్రలో గత బీజేపీ ప్రభుత్వంలో 70వేల ఇళ్లను ఏడాది కాలంలో పూర్తి చేశారని పేర్కొన్నారు. లబ్దిదారులందరూ ఒకేరోజు గృహ ప్రవేశం చేశారని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉందన్నారు. ఇప్పటివరకూ ఎంతమంది పేదలకు ఇచ్చాం... ఎంతమందికి ఇవ్వలేదనే విషయాన్ని సీఎం పట్టించుకోలేదన్నారు.

బోజాగుట్టలో పేదల పరిస్థితి ఇదీ : బండి సంజయ్

బోజాగుట్టలో పేదల పరిస్థితి ఇదీ : బండి సంజయ్

బోజాగుట్టలో 40 ఎకరాల స్థలంలో పేదలు ఇళ్లు నిర్మించుకుని ఉంటే.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారని అన్నారు. కానీ ఇంతవరకూ అక్కడ ఇళ్లు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర సందర్భంగా అక్కడి ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు వారికి నిలువ నీడ లేని పరిస్థితి ఉందన్నారు. 100 గదులతో వందల కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదని ఫైర్ అయ్యారు. బోజాగుట్టలో స్థలాన్ని ఎంఐఎం నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకూ కట్టింది 8వేల ఇళ్లే : బండి సంజయ్

ఇప్పటివరకూ కట్టింది 8వేల ఇళ్లే : బండి సంజయ్

అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సమావేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి తాను ప్రశ్నించానని గుర్తుచేశారు. ఇప్పటివరకూ అర్బన్‌లో కేవలం 8వేల ఇళ్లు మాత్రమే కట్టించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌ ప్రజలకు వద్దకు వెళ్తారని విమర్శించారు. కేసీఆర్ తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కేసీఆర్‌తో కాదని... ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని వ్యక్తి ఇక ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా ప్రధానమంత్రి ఆవాస యోజనా పథకాన్ని అమలుచేయాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ కేవలం మున్సిపాలిటీల్లోనే 2,03,080 ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి 1లక్షా 40వేలు ఇళ్లు కేటాయించారని చెప్పారు. వీటి నిర్మాణం కోసం రూ.3500 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.2285కోట్లు ఇప్పటికే విడుదల చేసిందన్నారు. స్మార్ట్ సిటీల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తోందన్నారు.

బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర

బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి రోజు 10కి.మీ మేర పాదయాత్ర జరిగింది. మొత్తం 4 విడతల్లో ఆయన పాదయాత్ర సాగనుంది. మెదటి విడత పాదయాత్రను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున హుజురాబాద్‌లో ముగించనున్నారు.

పాదయాత్ర మొదటి రోజు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదని... కుటుంబ పాలన నడుస్తోందని ఈ సందర్భంగా సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్దంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+