బండి సంజయ్ కు జాక్ పాట్ - ఏపీ నుంచి పోటీ..!?

బండి సంజయ్ కు రాష్ట్ర స్థాయి పదవి పోయింది. ఇప్పుడు జాతీయ స్థాయి పదవి దక్కనుంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండి సంజయ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారంలో జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ పదవి ఖాయమైందని సమాచారం. కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఏపీ నుంచి కేబినెట్ లో స్థానం దక్కేదెవరికనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సమీకరణాలు మారుతున్నాయి
కేంద్రం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విపక్షాలు ప్రధాని మోదీ లక్ష్యంగా ఏకం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోదీ తన హ్యాట్రిక్ విజయం కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా.. పార్టీలోనూ భారీ ప్రక్షాళన ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చారు. అందులో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు.

Bandi Sanjay

ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తొలిగింపు కార్యకర్తలకు రుచించటం లేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా పార్టీలో జోష్ పెంచారనే అభిప్రాయం ముఖ్య నేతలు అంగకరిస్తున్నారు. ఈ సమయంలో బండి సంజయ్ కు సముచిత ప్రాధాన్యత దక్కుతుందని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

కేంద్ర మంత్రిగా బండి
తాజాగా కేంద్ర కేబినెట్ మార్పులు..చేర్పుల పైన ప్రధాని నివాసంలో సుదీర్ఘ సమావేశం జరిగింది. అందులో తెలంగాణ నుంచి బండి సంజయ్ కు కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ మంత్రిగానే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని..కీలక శాఖ దక్కుతందని చెబుతున్నారు.

కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించటంతో ఆయనను కేబినెట్ నుంచి తొలిగింపు తప్పదని చర్చ సాగుతోంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది పార్టీ విధానం కావటంతో కిషన్ రెడ్డిని మంత్రి పదవిలో కొనసాగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి మరో నేతకు కేబినెట్ లో అవకాశం దక్కుతుందనే ప్రచారం ఉన్నా.. సమీకరణాల కారణంగా ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారని సమాచారం.

ఏపీలో దక్కేదెవరికి
బండి సంజయ్ కు కీలక మంత్రిత్వ శాఖ అప్పగించి..కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణలో దూకుడు రాజకీయం చేయాలని బీజేపీ వ్యూహం సిద్దం చేస్తోంది. ఈ సమయంలోనే ఏపీ బీజేపీ నేతల్లో కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించటంతో.. కేబినెట్ లో ఎవరికి స్థానం కల్పిస్తారనే లెక్కలు మొదలయ్యాయి.

Bandi Sanjay

ఏపీకి చెందని జీవీఎల్, సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ స్థానాలు గెలిచినా..పరోక్షంగా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో, ఏపీకి అసలు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా లేదా అనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+