బండి సంజయ్ మరో సంచలనం, కీలక మలుపు..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్‌ఎస్ నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలపై కేసీఆర్‌కు నమ్మకం లేదన్నారు. తాను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే తండ్రీ కొడుకులు ఇద్దరూ జీవితాంతం జైల్లోనే ఉంటారంటూ మండిపడ్డారు. కేటీఆర్ కు సవాల్ చేసారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేయటం పైన మండిపడ్డారు. మావోయిస్టు సానుభూతిపరులమంటూ తన పేరును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పోలీసుల లిస్టులో చేర్చారని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలకు సిగ్గుంటే పార్టీ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేసారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ ఇస్తే కొల్లిక్కి వస్తుందని పేర్కొన్నారు. రాధాకిషన్ వాంగ్మూలంలో కేసీఆర్ పేరు ఉందని చెప్పారు. విచారణ కోసం కేసీఆర్‌ను ఎందుకు పిలవడం లేదో చెప్పాలని డిమాండ్ చేసారు.

Bandi Sanjay Open challenge to BRS Working president KTR on phone tapping

ఫోన్ ట్యాపింగ్‌పై తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులపై కేటీఆర్ ప్రమాణం చేయాలని సవాల్ చేసారు. తాను కూడా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తానని చెప్పారు. ఏ గుడికి రమ్మంటారో టైమ్, డేట్ చెప్పాలని సవాల్ చేసారు.. కేటీఆర్ లీగల్ నోటీసులకు తాను భయపడనని చెప్పుకొచ్చారు.

Bandi Sanjay Open challenge to BRS Working president KTR on phone tapping

కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. తాజాగా, బండి సంజయ్‌కి లీగల్ నోటీసు పంపించారు. రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయన్నారు. చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం కొత్త కాదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+