వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా గవర్నర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత అవమానమా కేసీఆర్: బండి సంజయ్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంపై ఆయన విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంట కలిపే నిర్ణయాన్ని కెసిఆర్ తీసుకున్నారంటూ మండిపడ్డారు.

కేసీఆర్‌ కు ఇంటిపోరు; ఆయన జాతీయ రాజకీయాల పాట వెనుక మతలబు చెప్పిన బండి సంజయ్‌కేసీఆర్‌ కు ఇంటిపోరు; ఆయన జాతీయ రాజకీయాల పాట వెనుక మతలబు చెప్పిన బండి సంజయ్‌

 రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?

రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?

మహిళా గవర్నర్ కాబట్టి ఇంతగా అవమానిస్తున్నారా అంటూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్. రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రతినిధిని కెసిఆర్ అవమానిస్తున్నారని, కెసిఆర్ కు పోయేకాలం దాపురించింది అని విమర్శించారు బండి సంజయ్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. పోగాలం దాపురించింది కాబట్టే విపరీత బుద్ధులు పుడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న శాసనసభ సాంప్రదాయాలను, గౌరవాన్ని కేసీఆర్ మంట గలుపుతున్నారు అని బండి సంజయ్ విమర్శించారు.

రాజ్యాంగం పై నమ్మకం లేనోడు రాజ్యాంగ ప్రతినిధులను గౌరవిస్తాడు అనుకోవడం అత్యాశే

రాజ్యాంగం పై నమ్మకం లేనోడు రాజ్యాంగ ప్రతినిధులను గౌరవిస్తాడు అనుకోవడం అత్యాశే


రాజ్యాంగానికి లోబడి కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు తప్పా యుద్ధం చేసి గెలవలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు. సాంప్రదాయాలను, చట్టాలను గౌరవించలేని వ్యక్తికి నైతికంగా ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని బండి సంజయ్ విమర్శించారు. రాజ్యాంగం పై నమ్మకం లేనోడు రాజ్యాంగ ప్రతినిధులను గౌరవిస్తాడు అనుకోవడం అత్యాశే అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

గవర్నర్ ప్రసంగం విషయంలో సోయి సీఎం కేసీఆర్ కు లేకపోవడం శోచనీయం

గవర్నర్ ప్రసంగం విషయంలో సోయి సీఎం కేసీఆర్ కు లేకపోవడం శోచనీయం


రాజ్యాంగం పై నమ్మకం లేకపోతే కేసీఆర్ సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ తన ఉపన్యాసంలో మై గవర్నమెంట్ అని మాత్రమే ఉచ్ఛరిస్తారు అని, కేంద్ర పథకాలనో, సొంత వ్యాఖ్యానాలనో ఆమె జోడించబోరు అనే సోయి సీఎం కేసీఆర్ కు లేకపోవడం శోచనీయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగం విషయంలో మార్పులు చేర్పులు చేసుకుని మాట్లాడే అవకాశం గవర్నర్ కు ఉండదన్న విషయం తెలిసి కూడా గవర్నర్ ప్రసంగాన్ని తీసివేయడం దారుణమని అభిప్రాయపడ్డారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేకనే గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు

టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేకనే గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు


బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే గవర్నర్ చదువుతారనే సంగతి కేసీఆర్ కు తెలియదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏమి లేకనే గవర్నర్ ప్రసంగాన్ని దాటవేస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా కనిపిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Recommended Video

Bandi Sanjay : కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడతాం | Oneindia Telugu
 సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చెయ్యాలి

సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చెయ్యాలి

కెసిఆర్ రాజ్యాంగంపై నమ్మకం ఉంచి సభా సంప్రదాయాల ప్రకారం వ్యవహరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమైనా ఉంటే గవర్నర్ ద్వారా సభలో చెప్పించి ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కెసిఆర్ నియంత పోకడలపై టిఆర్ఎస్ శాసన సభ్యులు కూడా ఆలోచించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? అనేది ఒక్కసారి ఆలోచించాలని ప్రజాస్వామ్య వాదులను ఉద్దేశించి బండి సంజయ్ పేర్కొన్నారు. గవర్నర్ విషయంలో కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

English summary
Bandi Sanjay was furious with CM KCR for saying that the Chief Minister's decision to continue the Assembly budget meetings without the Governor's speech was atrocious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X