బిజెపి గెలుపును సీఎం రేవంత్ రెడ్డి ధృవీకరించారు.. వార్ వన్ సైడే: బండి సంజయ్
కరీంనగర్ లో కమల వికాసం కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచేది బిజెపినేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. గెలుపు bjp దే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గం లో తనకు బంపర్ మెజారిటీ ఖాయమని, ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు బండి సంజయ్.
ఓటమి టెన్షన్ రేవంత్ రెడ్డి ముఖంలో కనిపించింది
ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపికి మెజారిటీ సీట్లు తథ్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలుపును సీఎం రేవంత్ రెడ్డి ధృవీకరించారు అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఓటమి ఖాయం అనే టెన్షన్ సీఎం ముఖంలో కనిపించిందని, ఆ కోపంతోనే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి రేవంత్ రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు.

రాజకీయాలను పక్కనపెట్టి రేవంత్ ఈ పని చెయ్
తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి, మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా ప్రజలు మోసపోయే స్థితిలో లేరనే విషయాన్ని గుర్తించాలని బండి సంజయ్ సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి ఇకనైనా ప్రజా సమస్యల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించాలని బండి సంజయ్ హితవు పలికారు.
వార్ వన్ సైడే ఉందన్న బండి సంజయ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని, లేని పక్షంలో ఆరు హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వం పైన బిజెపి ఒత్తిడి తెస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్న సమయంలో అప్పుడే వార్ వన్ సైడే ఉందని పేర్కొన్నారు.
బీజేపీ గ్రాఫ్ పెరిగింది
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అధికారం, డబ్బు, ఉపయోగించి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, కానీ వాటికి లొంగకుండా ఓటర్లు ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలని బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమదే అన్నారు.












Click it and Unblock the Notifications