Bandi Sanjay: హిందువులంతా ఒకటైతే ఏం జరుగుతుందో జూన్ 4న చూస్తారు..!
హిందువులంతా ఒకటైతే ఏం జరుగుతుందో జూన్ 4న చూస్తారని బీజేపీ జాతియ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. జూన్ 4 వచ్చే ఫలితాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ చెంపపెట్టగా ఉంటాయని బండి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ముస్లింలంతా ఏకమై బండి సంజయ్ ని ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చాడని.. కానీ హిందువులంతా ఏకమై బండి సంజయ్ ను గెలిపించబోతున్నారని చెప్పారు. కేసీఆర్ 100 సంవత్సరాలు బతుకాలనుకునే వారిలో తాను ఒకడినని బండి అన్నారు.
కరీంనగర్ ఫలితాలు వచ్చే ముందు కేసీఆర్ తన చుట్టు వైద్యులను ఉంచుకోవాలన్నారు. ఇప్పటికైనా హిందువులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తన గెలుపు కోసం కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ వస్తుందని బండి ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ మంగళవారం కరీంనగర్ లోని పార్టీ కార్యాలయం నుంచి తన అల్లుడి యాక్టివపై ఎక్కించుకుని సిటీలో తిరిగారు. ఓ బేకరికి వెళ్లి పన్నీర్ పప్ తిన్నారు.

పలువురికి సెల్ఫీలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ రావు పోటీ చేశారు. మే 13 పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 17 స్థానాలకు పోలింగ్ జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా అదే రోజు పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications