బతుకమ్మ పేరుతో డిస్కోడ్యాన్సులు చేసిన పాపం ఊరికే పోదు: కవితపై బండి సంజయ్ తీవ్రవ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ కుమార్తె కవిత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ పాదయాత్రలో జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభలో... విద్యార్థులతో కుర్చీలు వేయించారు. ఇంకా వారితో ఎన్నో పనులు చేయించారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది: బండి సంజయ్

టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది: బండి సంజయ్

దేశంలో చైనా బజార్లు అని అంటున్న కేసీఆర్ కు సిగ్గుండాలి అని పేర్కొన్న బండి సంజయ్ చైనా బజార్లను భారత్ బజార్లుగా మార్చిన ఘనత మోడీది అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది అంటూ బండి సంజయ్ కేసీఆర్ జాతీయ పార్టీ ని టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏమీ చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే... మతతత్వం రెచ్చగొట్టినట్టా? అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ సంఘ విద్రోహ శక్తులు జగిత్యాల్ అడ్డాగా మారిందని, పీఎఫ్ఐ అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు ఫండింగ్ చేస్తున్నది కేసీఆర్ పార్టీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి సహకరించటం లేదు

కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి సహకరించటం లేదు


వేములవాడ ఆలయాన్ని 'ప్రసాదం స్కీం' కింద అభివృద్ధి చేద్దామంటే... కేసీఆర్ సహకరించడం లేదన్నారు. వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అన్న కేసీఆర్.... నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్లు అన్న కేసీఆర్...ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అంటున్నారని, కొండగట్టులో కేసీఆర్ బిడ్డ కవిత ఏదైనా జాగా కొని ఉండవచ్చు. అందుకే ఇప్పుడు 100 కోట్ల రూపాయలని అంటున్నాడు అంటూ నిప్పులు చెరిగారు.

బతుకమ్మను కించపరిచిన పాపం కవితకు తగులుతుంది

బతుకమ్మను కించపరిచిన పాపం కవితకు తగులుతుంది


కొండగట్టు ప్రమాదంలో అంతమంది పేదోళ్లు చనిపోతే... ఒక్కసారైనా కేసీఆర్ వచ్చి, సంతాపం ప్రకటించాడా..? ఆ బాధిత కుటుంబాలను ఆదుకున్నాడా...? కనీసం ఆ కుటుంబాలను పరామర్శించాడా? అని ప్రశ్నించారు. కెసిఆర్ బిడ్డ కవిత లిక్కర్ దందా చేసిందని, బతుకమ్మ పేరు మీద డిస్కో డాన్సులు చేసిందని, బతుకమ్మ పేరుతో మన సాంప్రదాయాన్ని, బతుకమ్మను కించపరిచిందని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ తల్లిని కించపరిచిన కేసీఆర్ బిడ్డ ఇప్పుడు లిక్కర్ దందాలో ఇరుక్కుందని, పాపం ఊరికే పోతుందా అని బండి సంజయ్ విమర్శించారు. దొంగ దందా చేసిన కెసిఆర్ బిడ్డ కవిత సింహం, పులి బిడ్డ నా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ ని అరెస్టు చేయాలా వద్దా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు

బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు


లిక్కర్ దందా చేసిన కెసిఆర్ బిడ్డని అరెస్టు చేస్తే.. జగిత్యాల జనం ధర్నా చేయాలా .. ఆలోచించండి అన్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిపై సీబీఐ, ఈడీ విచారణ జరగాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేలా కెసిఆర్ చూస్తున్నాడని, ఒకవేళ అదే జరిగితే కెసిఆర్ ను బయటకు లాగుతామన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, ఇప్పుడు బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడు అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కలిసి... కాంట్రాక్టులు చేస్తూ... కమీషన్లు తీసుకుంటూ... రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సెంటిమెంటు రగిలించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

పుట్టబోయే బిడ్డ నెత్తిమీద కూడా లక్ష రూపాయల అప్పు

పుట్టబోయే బిడ్డ నెత్తిమీద కూడా లక్ష రూపాయల అప్పు


తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ సర్వ నాశనం చేశాడని, పుట్టబోయే బిడ్డ నెత్తిపైన కూడా లక్ష రూపాయల అప్పు పెట్టాడని బండి సంజయ్ విమర్శించారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అని పేర్కొన్న బండి సంజయ్ కేసీఆర్ ఢిల్లీకి పోయాడని, ఇక అటే పోతాడని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి' పేరు నుంచి 'తెలంగాణ' పదాన్ని తీసేశాడని, తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని, తెలంగాణ తల్లికి ద్రోహం చేశారంటూ బండి సంజయ్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+