కారు పూర్తిగా రిపేర్, ఇంటర్నేషనల్ మెకానిక్ వచ్చినా బాగవటం కష్టమే!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. ఈనెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సమరం జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.
బీజేపీకి పట్టం కడితే అభివృద్ధి చేసి చూపిస్తా: కేంద్రమంత్రి బండి సంజయ్
తాము కేంద్రం నుండి నిధులను వరదలా తీసుకువస్తామని, బీజేపీకి పట్టం కడితే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన ప్రచారం చేస్తున్నారు. తాజాగా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ వద్ద నిధులే లేవు, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చేశారు తప్ప చేసిందేమీ లేదన్నారు. ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు.

కేసీఆర్ ఫాం హౌస్ కి పరిమితం అయ్యింది అందుకే
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ కారు పూర్తిగా రిపేర్ అయిందని, ఇంటర్నేషనల్ మెకానిక్ వచ్చినా దానిని బాగుచేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని పేర్కొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే పైన పోలీసులు తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులకు బండి సంజయ్ హెచ్చరిక
అంతేకాదు పోలీసులకు తన హెచ్చరికను జారీ చేశారు. పోలీసులు వేములవాడ ఎమ్మెల్యే ఆదేశాలతో పని చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తూ ఉంటే వంత పాడుతారా అంటూ ప్రశ్నించారు. మా విజ్ఞప్తిని చేతగానితనంగా భావిస్తున్నారా అంటూ నిలదీశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని లేదా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్, ఇదే కనుక కొనసాగితే మీ డీజీపీని, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.
ఆ పని చెయ్యకుంటే తీవ్ర పరిణామాలు పక్కా
బీజేపీ నాయకులు, సిబ్బందిపై దాడి చేసిన సిరిసిల్ల సీఐ క్రిష్ణ ఓవరాక్షన్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆ సీఐ ను తక్షణమే విధుల్లోంచి తప్పించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక జారీ చేశారు. వేములవాడలోని నాంపల్లి, తిప్పాపూర్, మహంకాళి చౌరస్తా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అవసరమైతే తాను వేములవాడలోనే కూర్చుంటానని, ఏం చేయాలో మాకు తెలుసన్నారు. మీ తాటాకు చప్పళ్లకు భయపడేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications