బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరు మార్పు, దత్తత: బండి సంజయ్ హాట్ కామెంట్స్

భైంసా: తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మిగులు నిధులతో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరు మార్పు, దత్తత

బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరు మార్పు, దత్తత

బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరును మైసాగా మారుస్తామని బండి సంజయ్ అన్నారు. అంతేగాక, అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామని చెప్పారు. భైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే భైంసాలోని బీజేపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీయాక్టులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ సర్కారుకు మూడిందన్నారు.

భైంసా భారతదేశంలో లేదా అంటూ బండి సంజయ్ ఫైర్

భైంసా భారతదేశంలో లేదా అంటూ బండి సంజయ్ ఫైర్

బీజేపీని ఈరోజు భైంసాకు రాకుండా నిషేధించారని, భైంసా ఏమైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. భైంసాకు రావాలంటే వీసా తీసుకుని రావాలా? అని కేసీఆర్ సర్కారును నిలదీశారు. మతవిద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చు.. తమ దేవతలను కించపర్చే మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా తిరగొచ్చు.. ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చట అని అన్నారు. దేశం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ వాళ్లు మాత్రం సభలు పెట్టుకోవద్దట అని మండిపడ్డారు.

ఐదు లక్షల కోట్లు ఏం చేశారంటూ కేసీఆర్‌పై బండి సంజయ్

ఐదు లక్షల కోట్లు ఏం చేశారంటూ కేసీఆర్‌పై బండి సంజయ్

తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు బండి సంజయ్. రూ.5 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి అధికారం ఇస్తే మరో 5 లక్షల అప్పులు చేస్తారని మండిపడ్డారు. ఒక్క సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలిస్తనన్న నరేంద్ర మోడీ.. ఒక్క రోజులోనే 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలిచ్చారని చెప్పారు. కేసీఆర్ మాత్రం ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ముథోల్‌లో ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చినవ్, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినవ్.. ఎందుకు అభివృద్ధి చేయడం లేదని బండి సంజయ్ నిలదీశారు.

భైంసా హిందువులు భయపడొద్దు.. అండగా ఉంటామన్న బండి

భైంసా హిందువులు భయపడొద్దు.. అండగా ఉంటామన్న బండి

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కోసం బీజేపీ ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్. అక్కడి కాంట్రాక్టర్ కేసీఆర్ చుట్టం కాబట్టే విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఇలాంటి సీఎం వల్ల అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. భైంసాలో హిందు సమాజం భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ వారికి అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+