వైఎస్సార్ చనిపోతే జగన్‌కు సీఎం పదవి వచ్చిందట..!

Bandla Ganesh: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్.. విమర్శలకు కేంద్ర బిందువు అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని తిప్పికొడుతున్నారు.

హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు బండ్ల గణేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో రోజా చేసిన విమర్శల గురించి విలేకరులు ప్రస్తావించగా.. దీనికి ఘాటుగా బదులిచ్చారు. రేవంత్ రెడ్డిని పోరాట యోధుడిగా, రోజాను డైమండ్ రాణిగా, ఐటమ్ రాణిగా అభివర్ణించారు.

Bandla Ganesh made key remarks on AP CM YS Jagan and Minister Roja

వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ వస్తుందో? రాదో.. అనేది అనుమానమేనంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎంగా రోజా చెప్పడాన్ని బండ్ల గణేష్ తప్పుపట్టారు. యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి కాదని.. ఆమె ఏ ముఖ్యమంత్రి వద్ద మంత్రి పని చేస్తోన్నారో.. ఆయనే యాక్సిడెంటల్ సీఎం అని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.

నాన్న గారు చనిపోవడం వల్లో, లేక వాళ్ల వారసత్వంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రాలేదని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఓ పోరాట యోధుడంటూ కితాబిచ్చారు. దేశం మొత్తం మీద రేవంత్ రెడ్డి వంటి పోరాట యోధులు చాలా తక్కువ మంది ఉంటారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ఎంతో పోరాడాడని, కష్టపడ్డాడని ప్రశంసించారు.

పులుసు వండి పెట్టడం వల్ల రోజాకు మంత్రి పదవి వచ్చిందంటూ సెటైర్లు వేశారు బండ్ల గణేష్. ఈ ఎన్నికల తరువాత వైఎస్ జగన్, రోజా మాజీ అవుతారని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చి పగలు జబర్దస్త్ షూటింగ్స్, రాత్రి పులుసు వండిపెట్టే కార్యక్రమాలు పెట్టుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించేంత స్థాయి రోజాకు లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+