లిక్కర్ స్కాం నుంచి బయటపడండి - కవిత పై బండ్ల ఫైర్..!!
తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన కవిత స్పందించారు. సీఎం సోదరులు జిల్లాల రివ్యూల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎం అని పిలుస్తున్నారని ఎద్దేవా చేసారు. ఈ వ్యాఖ్యల పైన బండ్ల గణేష్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఇంద్రెవెల్లిలో ప్రభుత్వ ఖర్చతో సభ ఏర్పాటు చేసి పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్ నిత్యం ఢిల్లీకి ప్రత్యేక విమానం, ఛార్టెడ్ ఫ్లైట్స్ లో వెళ్తున్నారని..ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారని ఆరోపించారు. రేవంత్ జై సోనియా అంటున్నారే కానీ జై తెలంగాణ అనటం లేదని చెప్పుకొచ్చారు. 60 రోజుల్లో ఒకే ఒక రోజు ప్రజాదర్బార్ లో సీఎం రేవంత్ పాల్గొన్నారని కవిత పేర్కొన్నారు. 60 రోజుల్లో కాంగ్రెస్ చేసింది ఏంటని ప్రశ్నించారు. రూ 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కార్యక్రమంలో ప్రియాంకతో ప్రారంభిస్తామని రేవంత్ చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యల పైన స్పందించిన బండ్ల గణేష్ పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడారా అని నిలదీసారు. జ్యోతీరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆపార్టీని విమర్శించొద్దన్నారు. సీఎం ప్రజల్లోకి వెళితే వాళ్లకు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అక్రమ సంపాదన చేయలేదా అంటూ నిలదీసారు. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ తెచ్చుకున్నారని మండి పడ్డారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాల్జేసారని బండ్ల గణేష్ మండిపడ్డారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications