ఆ తల్లికి గుండెకోత: కారుపై పడిన కారు, 9రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 2లో జులై ఒకటిన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుత్ను చిన్నారి రమ్య(9) శనివారం సాయంత్రం కన్నుమూసింది.

కారుపై పడిన కారు: చిన్నారి రమ్య బ్రెయిన్ డెడ్, అవయవదానం

తొలిరోజు పాఠశాలకు వెళ్లి తన తల్లి రాధిక, బాబాయిలు రమేష్‌, రాజేష్‌ తాత మధుసూదనచారిలతో కలిసి బంజారాహిల్స్‌ వైపు కారులో వస్తుండగా ఇంజినీరింగ్‌ విద్యార్థులతోకూడిన ఒక కారు ఎగిరి వీరి కారుపై పడింది. దీంతో రమ్య బాబాయి రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారంతా గాయపడ్డారు.

Banjara Hills accident victim Ramya died in hospital

చిన్నారి రమ్యను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పపత్రికి తరలించారు. చివరికి రమ్య బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వస్తున్నారు. శనివారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో రమ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కేర్‌ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

మద్యంమత్తులో కారు నడిపి తమ పాప, కుటుంబసభ్యుల మరణానికి కారణమైన
నిందితులను కఠినంగా శిక్షించాలని చిన్నారి రమ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. నిందిత యువకులను కాలేజీ, యూనివర్సిటీని నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మిన్నంటిన రోదనలు

కాగా, రమ్య మృతితో ఆమె కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రమ్య తాత, తల్లి ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కడసారి రమ్యను ముద్దాడిని ఆమె తల్లి గుండెలవిసెలా రోదించారు. కాగా, పోస్టుమార్టం నిమిత్తం రమ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం రమ్య భౌతికకాయాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

స్పీకర్, మంత్రుల సంతాపం

రమ్య మృతి పట్ల శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి కెటిఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధ్యతా రహిత డ్రైవింగ్ వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రమ్య మృతి బాధాకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Banjara Hills accident victim Ramya died in hospital on Saturday. Ramya, who was seriously injured in the accident, was on life support at Care Hospital. Doctors said that her condition worsened and brain stem reflexes were absent.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X