పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరెస్ట్, మీడియాపై కేసులు పెట్టే యోచనలో జనసేనాని?
హైదరాబాద్: మీడియా చానెళ్లపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఆయనకు మద్దతుగా శుక్రవారం పెద్ద ఎత్తున అభిమానులు ఫిలిం చాంబర్ వద్దకు తరలివచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఓబీ వ్యాన్, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని మీడియా వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్లతో దాడికి దిగారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జర్నలిస్టు సంఘాలు దాడిని ఖండిస్తూ పవన్ కు హెచ్చరికలు జారీ చేశాయి.
ఏబీఎన్ వాహనాలపై దాడికి పాల్పడ్డ పవన్ అభిమానులను తాజాగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భానుప్రసాద్ (ఉప్పల్) సాయి కిరణ్‌రెడ్డి (రామంతపూర్), హరికృష్ణారెడ్డి (చైతన్యపురి), అంబటి గోపి ఫణీంద్ర (కూకట్‌పల్లి), కంటిపూడి రామకృష్ణ (కూకట్‌పల్లి) ఉన్నట్టు సమాచారం.

కాగా, పవన్ ఆయన అభిమానుల వైఖరిని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నేడు జర్నలిస్టులంతా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసనకు దిగారు.
కేసులు పెట్టే యోచనలో పవన్:
మీడియా అధినేతలు పవన్ కల్యాణ్ పై పరువు నష్టం దావాకు దిగుతున్న నేపథ్యంలో.. ఆయన కూడా చట్టపరంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా చానెళ్లపై ఆయన కేసులు పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేసులు పెట్టడమా?.. లేక పరువు నష్టం దావా వేయడమా? అన్న దానిపై ఆయన రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
IPL 2026 Fan Parks: 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ లు-తెలంగాణలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications