వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ లోనూ బ్యాంకు ఉద్యోగుల సేవలు ... కరెన్సీతో కరోనా వస్తుందేమో అన్న భయాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరగకుండా కరోనా కట్టడి చెయ్యటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి . ఇక ఇదే సమయంలో చాలా శాఖల వాళ్ళు లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం విధులకు హాజరయ్యారు . వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్ ఉద్యోగులు, సింగరేణి కార్మికులుమాత్రమే కాదు బ్యాంక్ ఉద్యోగులు కూడా కరోనా లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల ఆర్ధిక అవసరాలు తీర్చటానికి కీలక భూమిక పోషిస్తున్నారు .

తెలంగాణాలో లాక్ డౌన్ యధాతధం... సీఎం కేసీఆర్ నిర్ణయం పైనే సర్వత్రా ఉత్కంఠతెలంగాణాలో లాక్ డౌన్ యధాతధం... సీఎం కేసీఆర్ నిర్ణయం పైనే సర్వత్రా ఉత్కంఠ

ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న బ్యాంకు ఉద్యోగులు

ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న బ్యాంకు ఉద్యోగులు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు కూడా తమ ప్రాణాలకు తెగించి విధులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ప్రతి ఒక్కరిని నేరుగా కాంటాక్ట్ అయ్యే పరిస్థితి ఉన్న కారణంగా కరోనా ఎక్కడ తమకు వస్తుందో అని భయపడుతున్నారు. ఇక సాధారణ పని రోజుల కంటే ఎక్కువగా బ్యాంకులకు ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా మాగ్జిమం పెరిగింది .

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కరోనా సాయం కోసం బ్యాంకులకు గుంపులుగా జనం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కరోనా సాయం కోసం బ్యాంకులకు గుంపులుగా జనం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు కరోనా సాయం అందిస్తున్న నేపధ్యంలో ఆ నగదు బ్యాంకులలలోనే జమ అవుతుంది. ఇక ఈ సమయంలో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.ఇక మన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సాయం బ్యాంకులలో డిపాజిట్ కాగా ఆ డబ్బు కోసం జనాలు క్యూ కట్టారు. గుంపులు గుంపులుగా బ్యాంకులకు రావడంతో బ్యాంకు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ళకు వెళ్లి తమ వారిని ముట్టుకోవాలంటే భయంగా ఉందని వారంటున్నారు .

కరెన్సీతో కరోనా వస్తుందేమో అని భయపడుతున్న బ్యాంక్ సిబ్బంది

కరెన్సీతో కరోనా వస్తుందేమో అని భయపడుతున్న బ్యాంక్ సిబ్బంది

ఇక అంతే కాదు కరెన్సీతో కూడా కరోనా వస్తుందని భావిస్తున్న నేపధ్యంలో కరెన్సీ ముట్టుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇక బ్యాంకులకు వచ్చిన ఖాతాదారులలో ఎవరైనా దగ్గినా , తుమ్మినా కరోనా లక్షణాలు ఉన్నాయేమో అని భయపడుతున్నారు. తమకు కరోనా వైరస్ ఎక్కడ వస్తుందో అని హడలిపోతున్నారు. కొంత మంది సిబ్బంధి విధులకు రావడానికే భయపడుతున్నారు. ఇక బ్యాంకులకు వచ్చే కస్టమర్లు తీసుకువచ్చే కరెన్సీ నుంచి కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంకు నుంచి ఇంటికి వెళ్లేసరికి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని బ్యాంక్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
In the present lock down situation, bank employees are also taking risk. Bank employees who perform duties, especially in areas where corona cases are most prevalent, are in tension. Corona is worried about where they will be due to a situation where everyone is in direct contact. There are more people coming to banks than usual working days due to the financial aid deposited in the poor people's accounts . The work pressure on employees has also increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X