అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏది నిజం?: బ్యాంకుల సమ్మెపై తలోదారి, అయోమయంలో ప్రజలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశవ్యాప్త సమ్మెపై బ్యాంకులు తలో మాట చెబుతున్నాయి. ఈ క్రమంలో అసలు బ్యాంకులు పనిచేస్తాయా లేదా? పని చేస్తే ఎన్ని రోజులు పనిచేస్తాయనే విషయంపై ప్రజలు అయోమయంలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... 23వ తేదీ హోలీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఆ తర్వాత 24న బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. 25న గుడ్‌ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆ తర్వాత 26న నాలుగో శనివారం, 27న ఆదివారం ఇలా వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. 26వ తేదీ నాలుగో శనివారం అయినప్పటికీ... తమ బ్యాంకులు పనిచేస్తాయని ఐడీబీఐ (క్లియరెన్స్ సేవలు మినహా) తమ ఖాతాదారులకు తెలియజేసింది.

కాగా, "మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే తదుపరి వారంలో బ్యాంకులన్నీ యథావిథిగా పనిచేస్తాయి" బ్యాంకు యూనియన్లు చెబుతున్నాయి. "ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల అమ్మకానికి నిరసనగా 28 నుంచి నాలుగు రోజుల సమ్మెకు దిగుతున్నాం" ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటన చేసింది.

Banks To Remain Closed For 4 Days From Thursday For Holi, Good Friday

తిరిగి 28 నుంచి రెండు రోజులు యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సమ్మె పిలుపునిచ్చింది. ఈ సమ్మె ఇంకా ఖరారు కావాల్సిఉంది. ఈ సమ్మెకు తాము మద్దతిస్తున్నట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యునీయన్ కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు.

ఐబీఏ వెబ్‌సైట్ ప్రకారం తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రంలోని బ్యాంకులకు హోలీ పండుగకు సెలవు ప్రకటించలేదు. అయితే వరుసగా నాలుగు రోజులు పాటు బ్యాంకులకు సెలవు వచ్చిన నేపథ్యంలో కస్టమర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏటీఎం మెషిన్లలో నగదు నింపాయి.

ఇక సోషల్ మీడియా, వాట్స్ యాప్ తదితర మాధ్యమాల ద్వారా 31 వరకూ బ్యాంకులు పనిచేయబోవని ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజుల పాటు అత్యధిక బ్యాంకులకు సెలవులు ఉండటం, ఆపై ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె వార్తలతో ప్రజలు వాస్తవం తెలియక అయోమయంలో ఉన్నారు.

English summary
Customers will not be able to conduct transactions in banks for 4 days in a row as they will be closed from Thursday in many states. However, according to officials, banks will try to ensure that ATMs remain operational during these holidays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X