వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు; డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై ఎక్సైజ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. రాడిసన్ హోటల్ లో నిర్వహిస్తున్న పబ్ లైసెన్స్ ను రద్దు చేసింది. హోటల్ కి సంబంధించి లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేసింది. రాడిసన్ హోటల్ లో 24 గంటలు లిక్కర్ సప్లై చేయడం కోసం అనుమతి తీసుకున్నారు. దీనికోసం 56 లక్షల రూపాయల టాక్స్ కూడా చెల్లించారు. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో పబ్ తో పాటు 24 గంటల 2బీ బార్ లైసెన్స్ ను కూడా రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఉల్లంఘించి పబ్ లు నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించింది.

రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పబ్ లో డ్రగ్స్ లభించిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు పబ్ మరియు బార్ లైసెన్స్ లను రద్దుచేశారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కేసీఆర్ ఆదేశాలతో గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా యజమానుల బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లైసెన్సు రద్దు చేస్తామని గతంలోనే హెచ్చరించినట్లు గా గుర్తు చేశారు.

 అధికారులు పబ్ లు, బార్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు

అధికారులు పబ్ లు, బార్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు


యజమానులు ఎంతటి వారైనా సరే నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో అధికారులు సైతం పబ్ లు, బార్ లపై నిరంతరం దాడులు కొనసాగించాలని, ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇక డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నాయి అన్న దానిపైన కూడా నిఘా పెట్టామని పేర్కొన్నారు. రాడిసన్ హోటల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు


ఇదిలా ఉంటే రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు రిపోర్ట్ కోసం పంపించారు. ఇక ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు, ఈ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

పరారైన వారి కోసం గాలింపు.. డ్రగ్స్ వినియోగించిన వారి డేటా కూడా సేకరిస్తున్న పోలీసులు

పరారైన వారి కోసం గాలింపు.. డ్రగ్స్ వినియోగించిన వారి డేటా కూడా సేకరిస్తున్న పోలీసులు

ఈ కేసులో పరారీలో ఉన్న అర్జున్, కిరణ్ రాజ్ ల కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. డ్రగ్స్ పబ్ లో కి ఎలా రవాణా అయ్యాయి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు డ్రగ్స్ ఎవరు వాడారు? బర్త్ డే పార్టీ ఎవరిది? కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పబ్ మేనేజర్ అనిల్ కుమార్ కీలకంగా మారారు. అసలు సూత్రధారులతో పాటుగా, ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన వారు ఎవరు అన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధాన నిందితుడు అనిల్, అభిషేక్ లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

English summary
The Excise Department has cancelled pudding and Mink Pub license at the Radisson Blue Plaza Hotel in Banjara Hills. It has also revoked the liquor license of the hotel. The case is being deeply investigated by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X