Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్ని పార్టీలు మారిన చరిత్ర కొండా ఫ్యామిలీది.. మీ లెక్కెంత.. భగ్గుమన్న బస్వరాజు సారయ్య

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కొండా దంపతులు వర్సెస్ స్థానిక ప్రజాప్రతినిధులు అన్నట్టు రాజకీయం సాగుతోంది. కొండా దంపతులు ఒక్క అడుగు ముందుకు వేస్తే వారు రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా దంపతుల పైన ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

క్రమశిక్షణ కమిటీకి కొండా లేఖపై భగ్గుమన్న ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు
అధిష్టానం ఏర్పాటుచేసిన క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి వారం రోజుల డెడ్లైన్ విధించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పేర్కొంది. కొండా మురళి సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వెల్లడించింది. అయితే కొండ మురళి తమను ఎవరు పిలవలేదని, తానే గాంధీభవన్ కి వెళ్లానని, బలప్రదర్శనకు వెళ్ళినట్టు వెళ్లడంతో అక్కడ పార్టీ అధిష్టానానికి ఇచ్చిన లేఖతో స్థానిక నేతలు మరింత భగ్గుమంటున్నారు.

baswaraj saraiah challenge to konda murali made shocking comments on konda family

Take a Poll

కొండా మురళికి బస్వరాజు సారయ్య సవాల్
తాజాగా ఈ వ్యవహారం పైన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కొండా దంపతులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నేతలను తిడతారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు కొండా మురళి.. నీ లెక్కెంత నీ బిషాదెంత అంటూ మండిపడ్డారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరిని నువ్వు గెలిపించావని చెప్పుకుంటున్నావ్.. ముందు ఒక పార్టీ పెట్టి నువ్వు గెలువు చాలు అంటూ కొండా మురళికి సవాల్ విసిరారు.

క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళి.. లేఖపై వరంగల్ లో నేతల భేటీ
రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న రామ సహాయం సురేందర్ రెడ్డి లాంటి వారిని కూడా తమ రాజకీయ అవసరాలకు పావుగా వాడుకున్నారని ఫైర్ అయ్యారు.కొండా మురళి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సందర్భంగా మీడియా ముందు మాట్లాడిన అంశాలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ లోకి మురళి ఎప్పుడు వచ్చారో చెప్పాలన్న సారయ్య
ఈ భేటీలో బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి , కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి , కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు హాజరయ్యా రు. మాట్లాడితే కొండా మురళి కాంగ్రెస్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాపాడుతున్నానని చెబుతున్నాడని , అసలు ఆయన కాంగ్రెస్ లోకి ఎప్పుడు వచ్చాడో చెప్పాలని నిలదీశారు.

అన్ని పార్టీలు మారిన ఏకైక కుటుంబం కొండా ఫ్యామిలీ
సంగెం జడ్పిటిసి గా పోటీచేసి ఘోర ఓటమి పాలైన విషయాన్ని మరిచిపోయావా అని ఎద్దేవా చేశారు . జిల్లాలో అన్ని పార్టీలు మారిన ఏకైక కుటుంబం కొండా ఫ్యామిలీ అని మండిపడ్డారు. అందరూ పార్టీలు మారారని విమర్శించే కొండ మురళి అన్ని పార్టీలు మారి వచ్చిన ఏకైక వ్యక్తి అంటూ నిప్పులు చెరిగారు సారయ్య. కొండా మురళికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ టిడిపి అని, కొండా మురళి దయాకర్ రావు శిష్యుడని గుర్తు చేశారు.

పరకాలలో చల్లా చేతిలో ఓడిపోలేదా
టిడిపి నుంచి కాంగ్రెస్లోకి వచ్చావని కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సీపీలోకి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చావని మళ్లీ కాంగ్రెస్ లోకి అక్కడినుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ కూడా దొరక్క పోతే, మళ్లీ అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చారని పరకాలలో పోటీ చేసి 47 వేల మెజారిటీతో చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు .

ఏ పార్టీలో ఉంటే ఆ నాయకులను తిడతారు
ఆ తర్వాత వరంగల్ తూర్పు లో పోటీ చేసి గెలిచారని , మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పులో కాంగ్రెస్ మూడో స్థానానికి చేరుకుందని గుర్తు చేశారు .ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులను తిట్టడం అలవాటుగా మారిందని, గతంలో సోనియాగాంధీని, కెసిఆర్ ను తిట్టిన సందర్భాలను సారయ్య గుర్తు చేశారు . పైగా కులం పేరుతో తిడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటివరకు వేచి చూస్తాం.. తర్వాత స్పందిస్తాం
క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కొండా మురళికి షోకాజ్ నోటీస్ ఇస్తే ఆ విషయం చెప్పకుండా తనను ఎవరు పిలవలేదని తానే గాంధీభవన్ కు వెళ్లానని చెప్పడం కమిటీపై గౌరవ లేనట్లేనని పేర్కొన్నారు . కొండా మురళిపై చర్యలకు సంబంధించి ఐదవ తేదీ వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత పరిణామాలను బట్టి స్పందిస్తామని బస్వరాజు సారయ్య తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కొండా మురళి వ్యవహారంలో ఓరుగల్లు నేతలు మాత్రం గట్టిపట్టు మీదే ఉన్నారు . మరి క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయం వరంగల్ కాంగ్రెస్ లో ఎటువంటి పరిణామాలకు కారణమవుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+