Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బతుకమ్మ చీరల పంపిణీ : నోరుజారిన మహిళా ఎంపీపీ; షాకిచ్చిన మహిళలు ఏం చేశారో తెలుసా!!

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. మొన్నటికి మొన్న బతుకమ్మ చీరల పంపిణీలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బతుకమ్మ చీరలను ఇస్తూ సీఎం కేసీఆర్ అందరికీ భర్త లాంటోడని నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజయ్య వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా జనం మండిపడ్డారు. ఇక ఈ ఘటన మర్చిపోకముందే తాజాగా మరో ప్రజా ప్రతినిధి బతుకమ్మ చీరల పంపిణీ లో నోరు పారేసుకున్నారు.ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.

 వనపర్తి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో ఎంపీపీ మౌనిక షాకింగ్ వ్యాఖ్యలు

వనపర్తి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో ఎంపీపీ మౌనిక షాకింగ్ వ్యాఖ్యలు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంపీపీ గుంత మౌనిక మహిళలకు చీరలు పంచారు. అయితే చీరలు తీసుకున్న మహిళలు ఏమీ బాగోలేవని, నాసిరకంగా ఉన్నాయని, మంచి చీరలు ఇవ్వాలి అని ఎంపీపీ మౌనికను కోరగా ఒక్కసారిగా అసహనానికి గురైన మౌనిక మహిళలను అవమానపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.
మేము ఇచ్చే చీరలు ఇవే.. ఇష్టమైతే తీసుకోండి.. లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపొండి అంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చీరలు తీసుకోకుంటే పొండి అంటూ మహిళలపై ఆగ్రహం, లేచి వెళ్ళిపోయిన మహిళలు

చీరలు తీసుకోకుంటే పొండి అంటూ మహిళలపై ఆగ్రహం, లేచి వెళ్ళిపోయిన మహిళలు

ఊరకనే ఇస్తుంటే తీసుకోవడానికి ఇబ్బంది అన్నట్టు అక్కడికి వచ్చిన మహిళలపై చిర్రుబుర్రులాడారు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు ఎంపీపీ కి షాక్ ఇచ్చారు. మహిళలందరూ అక్కడినుండి లేచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు కల్పించుకుని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు మాట వినలేదు. మీ చీరలు వద్దు.. ఏం వద్దు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మహిళలు ఇళ్లకు వెళ్లిపోయారు.

 చీరలు తీసుకోని వాళ్లకు పెన్షన్లు ఆపాలని ఆదేశం .. శాపనార్ధాలు పెట్టిన మహిళలు

చీరలు తీసుకోని వాళ్లకు పెన్షన్లు ఆపాలని ఆదేశం .. శాపనార్ధాలు పెట్టిన మహిళలు

అయినప్పటికీ మహిళల మీద ఎంపీపీ ఆగ్రహం చల్లారలేదు. వీళ్లకు చీరలు అవసరం లేకుంటే పెన్షన్లు కూడా ఆపాలంటూ అధికారులకు హుకుం జారీ చేస్తూ, మహిళలు తీసుకోకుండా వెళ్ళిపోయిన క్రమంలో చీరలన్ని ప్యాక్ చేసి తీసుకు వెళ్ళండి ఎవరడిగినా ఇవ్వద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఎంపిపి గుంత మౌనిక తీరుతో మహిళలు శాపనార్థాలు పెడుతూ అక్కడ నుండి వెళ్లిపోయారు. ఎంపిపి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మహిళలను ఎంత బ్రతిమిలాడినా ఫలితం లేకపోయింది. మీ చీరలు మాకు అక్కర్లేదు అంటూ తేల్చి చెప్పి మరీ వెళ్లిపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం .. చిట్యాలలో చీరలకు నిప్పు


ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరల పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు కట్టుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడుతుందా అనేది చెప్పాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. బతుకమ్మ చీరలు క్వాలిటీ లేకపోవడంతో మహిళలు అనేకచోట్ల నిరసన తెలియజేస్తున్నారు. మరోపక్క చిట్యాలలో నాణ్యతలేని బతుకమ్మ చీరలు ఇచ్చారని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చీరలను కుప్పగా వేసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడపడుచులు ఇష్టంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు క్వాలిటీ లేని చీరల పంపిణీ చేస్తోందని, ఈ చీరలు కట్టుకొని బతుకమ్మ పండుగ చేసుకోలేమని మహిళలు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో బతుకమ్మ చీరల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+