ఆ గదిలోనే..: శిరీషని చంపేసి గేమ్ ఆడారా, మరో అమ్మాయితో వెళ్లారా?

ఫిలిం నగర్‌లో ఆత్మహత్య చేసుకున్నదని భావిస్తున్న బ్యూటీషియన్ శిరీష కేసులో మరిన్ని కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.

హైదరాబాద్: ఫిలిం నగర్‌లో ఆత్మహత్య చేసుకున్నదని భావిస్తున్న బ్యూటీషియన్ శిరీష కేసులో మరిన్ని కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.

శిరీష మృతి కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీకి తీసుకున్నారు. వారిని ఈ రోజు, రేపు (సోమ, మంగళ) విచారిస్తారు.

వారే చంపేశారా?

వారే చంపేశారా?

శిరీషను రాజీవ్, శ్రవణ్‌లే హత్య చేసి, గేమ్ ఆడారా అనే కోణంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శిరీషను వారు కుకునూరుపల్లి నుంచి వస్తుండగా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరిన్ని కొత్త అనుమానాలు

మరిన్ని కొత్త అనుమానాలు

ఈ నేపథ్యంలో శిరీషను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది. కుకునూరుపల్లి నుంచి వచ్చాక రాజీవ్, శ్రవణ్, శిరీషలు స్టూడియో లోపలికి వెళ్లారా? అక్కడ ఆమెను చంపేసి ఉంటారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

వీడియో కాల్, మిస్ కాల్‌పైనా అనుమానాలు

వీడియో కాల్, మిస్ కాల్‌పైనా అనుమానాలు

శిరీష స్టూడియో లోనికి వెళ్లి.. రాజీవ్‌కు ఫోన్ చేసింది. రాజీవ్ కూడా ఆ తర్వాత ఫోన్ చేశాడు. ఈ మేరకు కాల్ లిస్ట్ ఉంది. కానీ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమెను హత్య చేసిన అనంతరం రాజీవే ఆమె ఫోన్ నుంచి తన ఫోన్‌కు వీడియో కాల్ చేశాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు. ఆ కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

మరో అమ్మాయితో వెళ్లారా?

మరో అమ్మాయితో వెళ్లారా?

లేదంటే వారు మరో అమ్మాయితో స్టూడియో లోనికి వెళ్లారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు. లేదంటే.. బయెమెట్రిక్ ద్వారా లోపలకు వెళ్లారు. అక్కడ హత్య చేసి, విషయం వెలుగు చూడకుండా వారు వ్యవహారం నడిపారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు. బయోమెట్రిక్ వద్ద సిసిటివి ఫుటేజీ కూడా లేదు.

ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతి తర్వాతనే విచారణ వేగవంతం

ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతి తర్వాతనే విచారణ వేగవంతం

తొలుత శిరీష మృతి చెందింది. దీనిపై కేసు నమోదయినప్పటికీ విచారణ వేగవంతంగా జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య అనంతరం.. విచారణ వేగవంతమయి ఉండవచ్చునని చెబుతున్నారు.

ఎన్నో అనుమానాలు

ఎన్నో అనుమానాలు

శిరీషది హత్యే అనేందుకు చాలా కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే నాలుక బయటకు ఎందుకు రాలేదని, కళ్లు ఎందుకు మూసి ఉన్నాయని, చున్నీ కట్ చేస్తే ఆమె బరువుకు ఎందుకు చిరగలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+