కొర‌క‌రాని కొయ్య‌గా పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల భ‌ర్తీ..! టెక్నిక‌ల్ క‌మిటీకి అప్ప‌జెప్పాల‌న్న కోర్ట్ ..!

హైదరాబాద్ : పంచాయితీ కార్య‌ద‌ర్శుల నియామ‌కాల ప‌ట్ల న్యాయ‌స్థానం ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేసింది. నియాకాల్లో త‌లెత్తుతున్న పొర‌పాట్ల‌ను అదిగ‌మించేందుకు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని, క‌మిటీ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా కార్య‌ద‌ర్శుల భ‌ర్తీ చేప‌ట్టాల‌ని కోర్ట్ పేర్కొంది. అంతే కాకుండా గ‌తంలో జ‌రిగిన నియ‌మ‌కాల విధానాల‌కు అనుస‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, ప‌రీక్షా విధి విధానాల‌ను కూడా క‌మిటీకి అప్ప‌జెప్పాల‌ని ప్ర‌భుత్వానికి అదేశాలు జారీ చేసింది. దీంతో ఎప్ప‌టినుండో వివాదాస్పందంగా మారిన పంచాయితీ కార్య‌ద‌ర్శుల భ‌ర్తీకి మార్గం సుగ‌మం అయిన‌ట్టు తెలుస్తోంది.

 పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల భ‌ర్తీకి క‌మిటీ వేయండి..! క‌మిటీ తుది నివేదికే ఫైన‌ల్ అన్న కోర్ట్..!!

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల భ‌ర్తీకి క‌మిటీ వేయండి..! క‌మిటీ తుది నివేదికే ఫైన‌ల్ అన్న కోర్ట్..!!

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షపై తలెత్తిన వివాదంపై నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదే శించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్‌లో ఇచ్చిన 14 ప్రశ్నలతో పాటు, తప్పుగా ఉన్నాయని వివాదం రేగిన 9 ప్రశ్నల విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నిపుణుల కమిటీ అవసరమని స్పష్టం చేసింది. పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్న ప్రశ్నలన్నింటినీ ఈ కమిటీకి నివేదించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసిం ది.

 కార్యదర్శుల రాత పరీక్ష తుది ‘కీ'ని కమిటీకి ఇవ్వండి..! ప్ర‌భుత్వానికి హైకోర్ట్ ఆదేశం..!!

కార్యదర్శుల రాత పరీక్ష తుది ‘కీ'ని కమిటీకి ఇవ్వండి..! ప్ర‌భుత్వానికి హైకోర్ట్ ఆదేశం..!!

అలాగే తుది ‘కీ'ని కూడా ఆ కమిటీ ముందుంచాలంది. నిపుణుల కమిటీ వెలువరించే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే, గిరిజన ప్రాంతాల్లోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 100% గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని, ఆ తర్వాత కూడా ఖాళీలు ఏర్పడితే వాటిని గిరిజన అభ్యర్థులతో భర్తీ చేసే నిమిత్తం నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

గిరిజన ప్రాంతాల్లో 100% పోస్టుల భర్తీ..! గిరిజ‌నుల‌కే అవ‌కాశం ఇస్తామ‌న్న స‌ర్కార్..!!

గిరిజన ప్రాంతాల్లో 100% పోస్టుల భర్తీ..! గిరిజ‌నుల‌కే అవ‌కాశం ఇస్తామ‌న్న స‌ర్కార్..!!

దీన్ని హైకోర్టు రికార్డ్‌ చేసుకుంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తుది ‘కీ'లో పలు తప్పులున్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఇచ్చారని, అదే విధంగా 9 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయంటూ మరికొంత మంది అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ప్రభుత్వ హామీని రికార్డు చేసిన న్యాయస్థానం..! క‌మిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయ‌న్న కోర్టు..!!

ప్రభుత్వ హామీని రికార్డు చేసిన న్యాయస్థానం..! క‌మిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయ‌న్న కోర్టు..!!

అలాగే గిరిజన ప్రాంతాల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 100% గిరిజనులతోనే భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారించారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కమిటీ ఏర్పాటు ద్వారా మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నారు. గిరిజ ప్రాంతాల్లోని పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం తరపు న్యాయవాది సంజీవ్‌కుమార్‌ ఇచ్చిన హామీని న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల పరీక్షపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను పరిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+