బీరు దొరకడం చాలా కష్టం.. త్వరపడండి
వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో తెలంగాణలో బీరు ఉత్పత్తి తగ్గింది. జోరుగా వర్షాలు కురిసే పరిస్థితి కూడా కనపడటంలేదు. చల్లగా బీరు తాగి సేదదీరుదామనుకుంటున్నవారికి ఒకరకంగా ఇది చేదువార్త అని చెప్పొచ్చు. బీరు సరఫరా కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ నీరు మాత్రం సరిపోవడంలేదు. ఎక్సైజ్ శాఖకు బీర్ల అమ్మకాల ద్వారా రూ.1458 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే రానున్న రెండు నెలల్లో బీరు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిననుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడనుంది.
గతంలో 1999లో ఇటువంటి కొరతే ఏర్పడింది. అయితే అది కొంతకాలమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సింగూర్ జలాశయం నుంచి నాలుగు బీరు తయారీ కంపెనీలకు 44 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాజెక్టులకు తాగునీటి కేటాయింపులు సరిగాలేవు. సింగూర్ ప్రజల దాహార్తి తీర్చకుండా బీరు కంపెనీలకు నీటిని ఎలా సరఫరా చేస్తుందని, అది అసాధ్యమంటున్నారు.

తాగునీటి ఎద్దడి, కరువు వల్ల సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గింది. ప్రయివేటు వనరుల నుంచి సేకరించడం కూడా ఎంతో కష్టంగా మారింది. SAB మిల్లర్ ఇండియా, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్డ్ ఇండియా, క్రౌన్ బీర్స్‌లకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తి తగ్గిపోయింది.
బీర్ల తయారీలో నీటి కొరత ఏర్పడుతుండటంతో నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఉపాధి కోల్పోయామని బాధితులు చెబుతున్నారు. దీనివల్ల ఖజానాకు రూ.1200 కోట్ల గండి పడింది. నగరం చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లలో కూడా నీటిమట్టాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో బీర్లు అందుబాటులో దొరకడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications