కాంగ్రెస్ సీనియర్ల కొత్త ఫిట్టింగ్ - రేవంత్ ఖరారు వేళ కీలక మలుపు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. సీఎల్పీ నేతను ఎన్నుకోవటం కోసం అటు గెలిచిన ఎమ్మెల్యేల తో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమయంలోనే సీఎం రేసులో ఉన్న నేతలు పార్టీ అగ్రనాయకత్వంతో మంత్రాంగం ప్రారంభించారు. రేవంత్ కు సీఎం పదవి ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ.. ఈ మంత్రాంగం ఆసక్తి కరంగా మారుతోంది.
సీనియర్ల మంతనాలు
తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతోంది. రేవంత్ సీఎం కాబోతున్నారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పార్టీ హైకమాండ్ సైతం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్ కు అప్పగిస్తూ ఏక వ్యాక్య తీర్మానం చేస్తారు.

హైకమాండ్ తెలంగాణ నూతన సీఎం ఎవరనేది అధికారికంగా ఖరారు చేయనుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ కు మద్దతుగా నిలుస్తుండటంతో రేవంత్ కే సీఎం పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. కానీ, ఈ సమయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన డీకే శివకుమార్ తో సీఎం పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
హైకమాండ్ కు క్లారిటీ
డీకేతో వేర్వేరుగా కలిసిన వారిలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. సీఎంను ఖరారు చేసే సమయంలో సామాజిక సమీకరణాలు..అనుభవం.. సమర్థత పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అందరి అభిప్రాయాలను హైకమాండ్ కు నివేదిస్తానని..పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుందని డీకే శివకుమార్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో రేవంత్ కాకుండా ఈ ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా ఆమోదమే అని చెప్పినట్లు మరో ప్రచారం సాగుతోంది. కానీ, త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు..కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు..ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.

రేవంత్ కే ఛాన్స్ ఉందా
ఎవరికి సీఎం పదవి వస్తుంది.. ఇతర ముఖ్య నేతలకు ఏ పదవి ఇస్తారనేది తేల్చిన తరువాతనే అధికారికంగా ప్రకటన చేయాలని ఈ నేతలు కోరినట్లు సమాచారం. దీంతో, కర్ణాటక తరహాలోనే రొటేషన్ పద్దతిలోనే సీఎం పదవితో పాటుగా..ఉప ముఖ్యమంత్రి పదవులు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
అయితే, ముందుగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొనేందుకు డీకే తో పార్టీ పరిశీలకులు సమావేశం జరిగే హోటల్ కు చేరుకున్నారు. తరువాత వారి అభిప్రాయాలను హైకమాండ్ కు నివేదించనున్నారు. అసవరమైతే రాత్రికి లేదా రేపు రేవంత్ తో సహా ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాతనే సీఎం ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. మారుతున్న పరిణామాలతో సీఎం ఎవరనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications