బెంగళూరు జంట హత్యలు: హైదరాబాదీ అరెస్ట్, ‘ఫేస్‌బుక్’తో దొరికిపోయాడు
బెంగళూరు: నగరంలోని పులికేశినగర్‌లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును 24గంటల్లోనే బెంగళూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో అతడి కోసం దర్యాప్తు కొనసాగించారు. పలువురిని విచారించగా ఆ నిందితుడు ఫేస్‌బుక్ ఖాతా కలిగివున్నాడని తెలిసింది. దీంతో ఫేస్‌బుక్ ప్రొఫైల్ సంపాదించిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.
నిందితుడు హైదరాబాద్ నగరంలోని బేగంపేటకు చెందిన చంద్రశేఖర్ అలియాస్ సుంకరి చంద్ సేట్(37)గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రేమ్‌చంద్ జైన్ ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ కేజీ హళ్లీలోని బిలాల్ మసీదు సమీపంలోని పిఅండ్ టీ కాలనీలో నివసిస్తున్నాడు.
హత్య అనంతరం చంద్.. టాక్సీ డ్రైవర్ అయిన తమ స్నేహితుడి వాహనంలో విమానాశ్రయం వరకు చేరుకున్నాడు. ఆ డ్రైవర్‌ను పోలీసులు విచారించగా జైన్ గురించి వివరాలు చెప్పాడు. బెంగళూరుకు చెందిన మరో స్నేహితుడు సల్మాన్ గురించి కూడా చెప్పాడు. దీంతో అతడ్ని కూడా పోలీసులు విచారించారు.

జైన్, టాక్సీ డ్రైవర్‌కు ఫేస్‌బుక్ ఖాతాలు లేవు. అయితే, సల్మాన్ వీరిద్దరికి స్నేహితుడు. కాగా, సల్మాన్‌కు ఫేస్‌బుక్ ఖాతాలో పలువురు స్నేహితులున్నారు. చంద్ సేట్ కూడా సల్మాన్‌కు ఫేస్‌బుక్ స్నేహితుడు కావడంతో పోలీసులకు అతడ్ని పట్టుకోవడం సులభమైంది. సల్మాన్ ప్రొఫైల్ నుంచి చంద్ సేట్ ఫొటో తోపాటు అతడు హైదరాబాద్ లో ఉంటాడని గుర్తించారు పోలీసులు. చంద్ సేట్ ఓ బార్ గర్ల్ సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
డబ్బు అవసరం ఉండటంతోనే తాను ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో చంద్ సేట్ తెలిపాడు. లైవ్ బ్యాండ్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఆ వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత ఫుట్‌పాత్‌లపై బట్టలు అమ్మానని తెలిపాడు. పలు వ్యసనాలకు అలవాటు పడిన తనకు ఈ వ్యాపారంతో వచ్చే డబ్బులు సరిపోలేదని చెప్పాడు. బార్ గర్ల కోసం కూడా భారీ ఖర్చు చేశానని తెలిపాడు.
ఈ క్రమంలో జైన్.. దంపతుల హత్యకు ప్రణాళిక వేశాడని, దీంతో డబ్బుల కోసం వారిని హత్య చేశామని సేట్ తెలిపాడు. జైన్, చంద్ సేట్‌ను అరెస్ట్ చేశామని డీసీసీ తూర్పు ఎన్ సతీష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. ఫ్రేజర్ టౌన్‌లోని కోల్స్ రోడ్‌లో నివాసముండే పర్వతరాజ్(61), ఆయన భార్య చంద్రకళ(55)లను ఏప్రిల్ 22న హత్య చేశారని చెప్పారు. బంగారు ఆభరణాలు, రూ. 50వేల నగదును అపహరించారని తెలిపారు. ఏప్రిల్ 24న












Click it and Unblock the Notifications