తెలంగాణ టాప్ లీడర్ పై రేప్ కేసు పెట్టిన ఐటీ హబ్ పోలీసులు, హోటల్ లో లేడీని !

బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి అలియాస్ కే. శివకుమార్ రెడ్డి పై బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. తెలంగాణ నారాయణ్ పేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కుంభం శివకుమార్ రెడ్డి బెంగళూరు నగరంలోని ఓ ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ హోటల్‌లో ఓ మహిళపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.

టీ కాంగ్రెస్ నాయకుడు కే. శివకుమార్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పుడు బెంగళూరులో కూడా అత్యాచారం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కబ్బన్ పార్క్ పోలీసులు టీ కాంగ్రెస్ నేత కే. శివకుమార్ రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Bengaluru police registered rape case against Telangana Congress leader K Sivakumar Reddy

తెలంగాణలోన నారాయణపేట్ జిల్లా చీఫ్ కే. శివకుమార్ రెడ్డి మీద గత ఏడాది మే నెలలో హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసులు అప్పట్లో తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే. శివకుమార్ రెడ్డి 2020లో ఓ మహిళను కలిశారని తెలిసింది.

నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెను కే. శివకుమార్ రెడ్డి చెప్పారని, అయితే ఆమె ఆయన మొదటి భార్య గురించి ప్రశ్నించిందని పోలీసులు అంటున్నారు. తన భార్య తీవ్ర అనారోగ్యంతో బాదపడుతోందని, ఆమె మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకదని, ఆమెను చూసుకోవడానికి తనను పెళ్లి చేసుకుంటున్నానని కే. శివకుమార్ రెడ్డి చెప్పారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

ఆ సందర్బంలో టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే. శివకుమార్ రెడ్డి ఆ మహిళ మెడలో పసుపుతాడు కట్టాడని పోలీసులు చెబుతున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే. శివకుమార్ రెడ్డి బాధితురాలిని పంజాగుట్టలోని ఓ హోటల్‌కు పిలిచి అత్యాచారం చేశాడని, ఆ మహిళ ఫొటోలు తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే ఆఫోటోలు బయటపెడతానని బెదిరించాడని హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

ఇప్పుడు ఇదే తరహాలో బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే. శివకుమార్ రెడ్డి మీద మరోసారి అత్యాచారం చేశాడని కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నాయకుడి మీద బెంగళూరులో రేప్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+