ఆవు మూత్రం పోసింది..జరిమాన ఎంత విధించారో తెలుసా..?
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.ఇల్లందు పట్టణంలోని రెండవ బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. దీంతో ఆగ్రహం చెందిన జీఎం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు సుందర్‌లాల్‌నుపిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని అందుకు కేసు నమోదు చేసి కోర్టు కు పంపిస్తామని అన్నారు. పోలీసుల పిలుపుతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్.. అని అడిగాడుదీంతో కేసు నమోదయిందని కోర్టుకి పోయి ఫైన్ చెల్లించాలని చెప్పినట్లు సుందర్‌లాల్ వెల్లడించాడు, చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్ లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న తరుణంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని పోలీసుల ఎదుట బాధపడుతుండడంతో స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదు ఇవ్వడం జరిగింది.


-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications