‘పొడిచింది హిందువులనే.. ఆస్తుల ధ్వంసం అయ్యింది వారివే.. అరెస్టూ వారినే’: చిన్నారిపై రేప్ జరిగితే?
హైదరాబాద్: బైంసా ఘర్షణల నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ.. హిందువులను హింసిస్తోందని మండిపడ్డారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు.

భైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన
బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంగన జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. ఈ ప్రభుత్వం పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో పెట్టిందని ఆరోపించారు. పరిస్థితి ఇలానే ఉంటే శాంతి భద్రతల సమస్యగా మారుతుందని గవర్నర్‌కు చెప్పామని తెలిపారు.

బాధితులైన హిందువులనే అరెస్టు చేస్తారా?
మహారాష్ట్ర నుంచి బహిష్కరించబడిన లుచ్చాలు బైంసాలో ఉన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. హిందూ కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఈ దుర్మార్గులు చేస్తున్నారని విమర్శించారు. పొడిచింది హిందువులనే.. ఆస్తుల ధ్వంసం అయ్యింది హిందువులవే.. అరెస్టు కూడా హిందువులను చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బైంసాలో చిన్నారిపై అత్యాచారం జరిగితే ఎందుకు స్పందించరు?
మానవత్వం లేని మానవ మృగం సీఎం కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక పసిపాప మీద అత్యాచారం జరిగితే సీఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు స్పందించరా? ఇతర రాష్ట్రాలో జరిగితే మాట్లాడే మీరు? ఇక్కడ జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ నిలదీశారు. సీఎం.. నీకు కుటుంబం ఉంది.. ఇదే పరిస్థితి నీ కుటుంబంకి జరిగితే ఎలా ఉంటుంది.. ఆలోచించుకో.. అని అన్నారు. పేద హిందువులపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

ప్రగతిభవన్‌లోకి దూసుకొస్తామంటూ బండి సంజయ్
ప్రగతి భవన్‌లోకి తమ కార్యకర్తలు, తాను చొరబడతామని.. సీఎంని బయటకు పట్టుకొచ్చి నిలదీస్తామని హెచ్చరించారు. హిందువులు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారుపై నమ్మకం లేకనే గవర్నర్ తలుపుతట్టామని అన్నారు. కాగా, ఇటీవల బైంసాలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడిన పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ నేతలు వారిని పరామర్శించారు. బైంసాలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై డీజీపీ సీరియస్‌గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications