తండ్రికి భారతరత్న: కూతురి కంట ఆనంద భాష్పాలు
Bharat Ratna: మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
పీవీ నరసింహారావుతో పాటు మాజీ ప్రధాని, దివంగత చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న పురస్కారానికి నామినేట్ చేసినట్లు తెలిపారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరును భారతరత్న పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఇదివరకే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీలకూ ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్ కే అద్వానీ మినహా మిగిలిన ముగ్గురికీ మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఇప్పటివరకు మొత్తం అయిదుమందికి భారతరత్న పురస్కారం లభించినట్టయింది.
తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు అపర చాణక్యుడిగా పేరుంది. రాజీవ్ గాంధీ హత్యానంతరం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 జూన్ నుంచి 1996 మే వరకూ ప్రధానిగా పూర్తికాలం పని చేశారు. పీవీ.. మైనారిటీలో ఉన్న అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు విజయవంతంగా నడపగలిగారు.
1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో ముఖ్యమంత్రిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మంథని ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. ఎంపీగా హన్మకొండ, మహారాష్ట్రలోని రామ్‌టెక్ స్థానాల నుంచి రెండు సార్లు చొప్పున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఉప ఎన్నిక ద్వారా నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
భారతరత్న పురస్కారానికి పీవీ పేరును నామినేట్ చేయడం పట్ల ఆయన కుమార్తె, భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసన మండలి సభ్యురాలు సురభి వాణిదేవి స్పందించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కొద్దిసేపటి కిందటే ఆమె శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడారు. తన తండ్రికి లభించిన అత్యుత్తమ గౌరవంగా అభివర్ణించారు. 1991 నుంచి 1996 వరకు అత్యంత క్లిష్టదశలో దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలను చేపట్టారని గుర్తు చేశారు. ప్రధానిగా దేశం ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను చాకచక్యంగా పరిష్కరించగలిగారని అన్నారు.
భారత్.. అన్ని రంగాల్లో ఇప్పుడు అత్యున్నతంగా నిలిచిందంటే దానికి కారణం.. తన తండ్రి వేసిన బాటలేనని సురభి వాణిదేవి అన్నారు. రాజకీయాలకు అతీతంగా తన తండ్రి పేరును నామినేట్ చేయడం సంతోషాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. జీవించినంత కాలం ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం భారత రత్న ఇచ్చిందని అన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications