మనిషి తలచుకుంటే ఏదైనా చేస్తాడు.. కుక్కను పులిగా మారుస్తాడు.. ఇది నిజం!!
ఓ రైతు కోతుల బారి నుండి తన పంటపొలాన్ని రక్షించుకోవడానికి కుక్కను పులిలా చారలు పెట్టి తన పంట పొలానికి కాపలాగా పెట్టారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. తిమ్మిని బొమ్మి చెయ్యగలడు. కుక్కను పులిలా మార్చగలడు. తన అవసరాలకు తగ్గట్టు పరిస్థితులనే కాదు జంతువులను కూడా వాడుకోగలడు.. ఇదేంటి అని చూస్తున్నారా.. మేము చెప్తుంది నిజమే.. మనిషి తన తెలివితేటలతో దేన్నైనా ఎలాగైనా మార్చగలడు. తాజాగా అటువంటి ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

కుక్కను పులిగా మార్చేసిన రైతు.. ఎలాగంటే
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం దమ్మూరు గ్రామపంచాయతీ బూర్గు గూడెంలో ఓ రైతు కోతుల బారి నుండి తన పంటపొలాన్ని రక్షించుకోవడానికి వినూత్నమైన ఆలోచన చేసాడు. ఇక రైతు చేసిన ఆ ఆలోచన స్థానికులను కాస్త భయపడేలా చేసింది. ఇంతకీ ఆ రైతు ఏం చేశారంటే తను పెంచుకుంటున్న గోధుమ వర్ణంలో ఉన్న కుక్కకు పులి మాదిరిగా ఒంటిపై అంతా నల్ల రంగు చారలు పెట్టి పంట పొలానికి కాపలాపెట్టాడు.

వాటి బారి నుండి పంటను కాపాడుకోవటంలో సక్సెస్ అయిన రైతు
ఇక కుక్కను చూసి పులి అని భ్రమ పడుతున్న కోతులు ఆ పంట వైపు రావడం మానేశాయి. కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి కుక్కకు పులి వేషం వేసిన రైతు తాను అనుకున్నది సక్సెస్ కావడంతో ఫుల్ ఖుషి లో ఉన్నారు. అంతకు ముందు పంట అంతా కోతుల పాలు కాగా ఈ కొత్త ఆలోచన పంట నష్టం కాకుండా రైతును కాపాడింది. కానీ పులిలాగా చారలు ఉన్న కుక్కను చూసి జనాలు మాత్రం సడన్ గా పులే వచ్చిందని భయపడుతున్నారు.

పులి వేషం కట్టిన శునకం.. ఐడియా బానే ఉందన్న గ్రామస్థులు
ఇక అసలు విషయం తెలిసి ఇదా సంగతి అంటూ ఆ రైతు ప్లాన్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక పులి వేషం కట్టిన శునకాన్ని చూడడం కోసం చుట్టుపక్కల గ్రామాల రైతులు సదరు రైతు ఇంటికి క్యూ కడుతున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న గ్రామాల ప్రజలు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అంటూ కుక్కల్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలా గ్రామ సింహాలను పులులుగా మార్చి తమ పంట పొలాలకు కాపలా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

పులిగా మారిన కుక్క వీడియో వైరల్
ఏదేమైనా మనిషి అత్యంత సమర్ధవంతంగా ఆలోచనలు చెయ్యగలడు. తన అవసరాలకు అనుగుణంగా ఏదైనా మార్చుకోగలడు. మనిషి చేసిన ఒక ఐడియా కుక్కను పులిని చేస్తే, వింత జంతువు గా మారిన గ్రామ సింహం మాత్రం యజమానికి విశ్వాసపాత్రంగా పనిచేస్తూ తన పని తాను చేసుకోపోతుంది. ప్రస్తుతం పులిగా మారిన కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications