Komatireddy Venkat Reddy: కేసీఆర్ కాంగ్రెస్‍తో కలవక తప్పదు.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెప్పారు. ఏ పార్టీ కూడా 60 సీట్లు గెలవలేదని.. హంగ్ తప్పదని జోస్యం చెప్పారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిలో పడుతుందని చెప్పారు.

గెలిచేవారికి టికెట్

గెలిచేవారికి టికెట్

కొత్తైనా.. పాతైనా.. గెలిచేవారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదన్నారు. తను స్టార్ క్యాంపెయినర్ అని.. మార్చి మొదటి వారంలో పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు 3,4 నెలల సమయమే ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు 60 రావన్నారు. ఆ సమయంలో
కాంగ్రెస్ బీజేపీతో, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేవు. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని చెప్పారు.

40-50 సీట్లు

వచ్చే ఎన్నికల్లో కష్టపడితే కాంగ్రెస్ కు 40-50 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెంకట్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని రాహుల్ గాంధీని ఇప్పటికే కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పొగడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయన్నాని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ ను పొగిడారని భావిస్తున్నట్లు చెప్పారు.

రేవంత్ రెడ్డి టార్గెట్..!

వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకపోయినా.. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు ఉండే అవకాశం ఉందన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటాలు మానుకుని పార్టీ కోసం పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+