మందు బాబులకు బిగ్ అలర్ట్.. 2 రోజులు వైన్స్ బంద్..!
తెలంగాణలోని మందు బాబులకు బిగ్ అలర్ట్. వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అటు ఆదిలాబాద్ లో ఈ నెల 4 నుంచి 6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితోపాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. గణేష్ శోభాయాత్రకు నగరం సిద్దమవుతోంది. ఈ మేరకు సెప్టెంబర్ 6న భాగ్యనగరం వ్యాప్తంగా గణనాధుల నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే భాగ్యనగరంలో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఈ నెల 4,5,6 తేదీల్లో జరగనున్న గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున జరగనుందని తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉన్న క్రమంలో గణేష్ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందో అనేది చాలా మందికి అనుమానం ఏర్పడింది. అయితే దీనిపై గణేష్ ఉత్సవ సమితి క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీనే విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications