హైదరాబాద్ - విజయవాడ హైవేకు మహార్దశ.. 60 అండర్ పాస్ బ్రిడ్జ్ లు..

హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన వారధిగా ఈ ఎన్ హెచ్ 65 ఉంది. అయితే ఈ రహదారిపై రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ హైవేపై రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 60 అండర్​ పాస్​ వంతెనల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. హైవేను దాటే టూ వీలర్స్ అలాగే పాదచారులు రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా జంక్షన్ వద్ద ఈ అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని ఎన్ హెచ్ ఏఐ భావిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన వారధిగా ఉన్న ఎన్ హెచ్ 65 పై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో NHAI కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మొత్తం దాదాపు 231 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఐకాన్స్ సంస్థ సిద్ధం చేసి తాజాగా సమర్పించింది. ఈ రహదారిపై దాదాపు 60 ప్రాంతాల్లో అండర్ పాస్ బ్రిడ్జ్ లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

BIG BREAKING NHAI to Build 60 Underpasses on Hyderabad-Vijayawada Highway

ఈ డీపీఆర్ లో పేర్కొన్న విధంగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ వరకు అంటే దాదాపు 231.32 కిలోమీటర్లు 6 వరుసల హైవేను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 60 ప్రాంతాల్లో అండర్‌పాస్‌ బ్రిడ్జ్ లను నిర్మించనున్నారు. ఈ 60 అండర్ పాస్ బ్రిడ్జ్ లను ప్రతీ 2 నుంచి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎన్ హెచ్ ఏఐ సిద్ధం అవుతోంది. దాంతోపాటు 17 వెహిక్యూలర్ అండర్ పాస్ లు , 35 లైట్ వెహిక్యులర్ అండర్ పాస్ లు.. అలాగే మరో 8 చిన్న అండర్ పాస్ లు, దాంతోపాటుగా 10 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు కూడా నిర్మితం కానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+