బీజేపీకి బిగ్ షాక్: సంచలన ప్రకటన చేసిన జూపల్లి కృష్ణారావు!!
రాష్ట్రంలో బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ లోకి ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మినహా, ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలు ఎవరూ కనిపించలేదు. చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల బాధ్యతలు తీసుకున్నా ఇతర పార్టీల నుండి నేతలను బీజేపీ లోకి తీసుకురావడంలో ఆయన విఫలమవుతున్నారు.
ఇప్పటికే అనేకసార్లు బీజేపీ లోకి రావాలని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని కోరిన బీజేపీ నేతలకు ఇరువురు నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా జూపల్లి కృష్ణారావు తాము బీజేపీలో చేరడం లేదని సంచలన ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. అంతేకాదు ఈటలనే తమతో పాటు రావాలని చెప్పమంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

ఈటల రాజేందర్ తమతో చర్చించిన మాట వాస్తవమేనని పేర్కొన్న ఆయన వచ్చే నెలలో తమ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ఈటల రాజేందర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బిజెపిలో చేరడం కష్టమేనని ప్రకటించారు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారని, క్షేత్రస్థాయిలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందని భావిస్తున్న ఇరువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతుంది .
జూన్ 8వ తేదీన జూపల్లి కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రస్తుతం విస్తృతంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా ఇరువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ చాలా కాలంగా పార్టీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ బాట పట్టడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి మొదటి నిర్ణయించినప్పటికీ, తాజాగా జూన్ 8వ తేదీన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఖమ్మంలో జూన్ 20వ తేదీ లోపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఉండగా ఆ సభ తరువాత పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరి నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. అనేక చర్చోపచర్చల తర్వాత బీజేపీకి షాక్ ఇచ్చి పొంగులేటి, జూపల్లి హస్తం బాట పట్టనున్నారు అని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications