మాజీ మంత్రి హరీష్ రావుకి బిగ్ షాక్.. మరో కేసు ఫైల్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకి బిగ్ షాక్ తగిలింది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హరీశ్ తో పాటు మరో ముగ్గురుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌కుమార్, రాములు, వంశీ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్‌రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్‌లో రెండో నిందితుడిగా చేర్చారు. అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ మేరకు పంజాగుట్టలో కేసు నమోదైంది. కోర్టులో సైతం ఈ వ్యవహారం నడుస్తోంది.
ఇక మరోవైపు SLBC టన్నెల్‌లో పనులు మొదలే కాలేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావుకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పెండింగులో ఎందుకు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
సొరంగాన్ని 200 మీటర్లు తవ్వి మిగతా దానిని ఎందుకు వదిలేశారని ఫైర్ అయ్యారు.

తక్కువ లాభం వస్తుందనే దీనిని మధ్యలో వదిలేశారా? ఈ సొరంగం నిర్మాణం పూర్తైతే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనా? ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని మూడు ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ నేతలు ప్రకృతి విపత్తులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగులో పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని వ్యాఖ్యానించారు. అద్భుతం జరిగితే తప్ప సొరంగంలో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
పాలమూరు రంగా రెడ్డిలో 6గురు చనిపోతే.. కేసీఆర్, హరీష్‌రావు చూడటానికి వచ్చారా అని మండిపడ్డారు. కొండగట్టు బస్ ప్రమాదంలో 70మంది చనిపోతే కేసీఆర్, హరీష్ రావు అప్పడేమైపోయారని ప్రశ్నించారు. SLBC ని పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చాం కదా.. వచ్చి చూసి పోండి అంతే కానీ అక్కడికి వెళ్లి రాజకీయాలు చెయ్యొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications