హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచేసింది. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి.. గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీలను పెంచినట్టు తెలుస్తోంది. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో మెట్రో ముఖ్య పాత్ర పోషిస్తోంది అనడంలో సందేహం లేదు.
పెరిగిన ఛార్జీల వివరాలు..
1- 2 రెండు స్టాప్స్ - రూ.12
2 నుంచి 4 స్టాప్స్ - రూ.18
4 నుంచి 6 స్టాప్స్ - రూ.30
6 నుంచి 9 స్టాప్స్ - రూ.40
9 నుంచి 12 స్టాప్స్ - రూ.50

12 నుంచి 15 స్టాప్స్ - రూ.55
15 నుంచి 18 స్టాప్స్ - రూ.60
18 నుంచి 21 స్టాప్స్ - రూ.66
21 నుంచి 24 స్టాప్స్ - రూ.70
24 స్టాప్స్.. ఆపైన రూ.75












Click it and Unblock the Notifications