జీఎస్టీ స్కాంలో A-5గా మాజీ సీఎస్ సోమేశ్ - అరెస్ట్ ఖాయం..!?
జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సోమేశ్ కుమార్‌ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ స్కాం పైన అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ప్రమేయం పై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. కఠిన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి.
సోమేశ్ ప్రమేయం
జీఎస్టీ స్కాంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
కమర్షియల్ ట్యాక్స్ , ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లు తేల్చారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని.. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో ఆధారాలు
తెలంగాణా బేవరెజస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్‌కు వేయి కోట్లు నష్టం వాటిన్నట్లు సమాచారం. మరో 11 ప్రైవేటు సంస్థలు రూ.400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొంత మందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేశ్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయ్యింది.
అసెంబ్లీలో చర్చ
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో చెల్లింపుల్లో రూ.1000 కోట్లు స్కామ్ జరిగినట్లు ఆరోపణల వచ్చాయి. నకిలీ ఇన్వైస్‌లు సృష్టించి నిందితుడు మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దాదాపు 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. లబ్ది పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ అడిట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాజీ సీఎస్ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్కామ్ పాల్పడ్డ నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. త్వరలో అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఈ స్కారం పైన ప్రభుత్వం అసెంబ్లీలోనూ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications