వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ పేరెంట్స్‌కు 'సుప్రీం' బిగ్ విన్: ఏపీ వాదనపై హైకోర్టు ఇలా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాఠశాలల్లోని స్కూల్ ఫీజుల పైన సుప్రీం కోర్టు ఆదేశాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు షాక్ అని అంటున్నారు. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) మీడియాకు మంగళవారం నాడు తెలిపింది.

దాని ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫీజు రెగ్యులేటరీ కమిటీలు కలిగి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని చెప్పారు. సుప్రీం బెంచ్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ఇది చెప్పిందన్నారు. ఈ అంశమై ప్రభుత్వం (ప్రభుత్వాలు) ఆరేళ్లయినా డాటా సమర్పించకపోవడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

లోకల్, నాన్ లోకల్‌పై అఫిడవిడ్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

ప్రయివేటు మేనేజ్‌మెంట్ కోటాలో లోకల్, నాన్ లోకల్ సీట్ల భర్తీకి అనుసరిస్తున్న విధానాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

Big win for Hyderabad parents as SC criticises Telangana, Andhra govts over school fees

జస్టీస్ వి రామసుబ్రమణ్యం, జస్టీస్ ఆనీస్‌లు ప్రయివేటు మెడికల్, డెంటల్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ పిటీషన్‌ను విచారిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికల్ 371 డి ప్రకారం కోటా భర్తీ చేస్తున్నట్టు యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది.

ఇదే సమస్య పైన ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై హైకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రయివేటు మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లను ఏ రాష్ట్రం వారితోనైనా భర్తీ చేసే అధికారం మేనేజ్‌మెంట్‌కు ఉంటుందని ఏపీ వాదించింది.

దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారితోనైనా భర్తీ చేయవచ్చునా? రెండు రాష్ట్రాలకు చెందిన వారితోనే భర్తీ చేయాలా? అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది.

English summary
Big win for Hyderabad parents as SC criticises Telangana, Andhra govts over school fees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X