Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss 5 Telugu: ఆ ఒక్కడు తప్ప: విమర్శల నుంచి వెక్కిరింపుల దాకా: హాట్‌గా నామినేషన్స్

హైదరాబాద్: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోలో నామినేషన్ల ప్రాసెస్ అనేది ఎప్పట్లాగే హాట్ హాట్‌గా సాగింది. నలుగురు ఆడవాళ్లు ఒకేచోట గుమికూడి ఉండలేరనే సామెతను గుర్తు చేసింది. ఒకరికిపై ఒకరు విమర్శించుకోవడాన్ని మించిపోయింది. వెక్కిరింపుల దాకా వెళ్లింది.

సింగిల్ డిజిట్‌లోకి..

సింగిల్ డిజిట్‌లోకి..

బిగ్‌బాస్ సీజన్ తెలుగు 5లో కంటెస్టెంట్ల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. 19 మందితో మొదలైన ఈ రియాలిటీషోలో ఇప్పుడు మిగిలింది తొమ్మిదిమందే. యూట్యూబర్ సరయు, ఉమాదేవి, లహరి షారీ, కోరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ.. ఆరోగ్య కారణాలతో బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చిది. టైటిల్ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లు తొమ్మిదిమందే ఉన్నారు.

ఆ ఒక్కడు తప్ప..

ఆ ఒక్కడు తప్ప..

ప్రతి సోమవారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. ఈ వారం కూడా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.. హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడానికి. యాంకర్ రవి తప్ప మిగిలిన కంటెస్టెంట్లందరూ ఈ ఎలిమినేషన్స్ లిస్ట్‌లోకి ఎక్కారు. ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, మానస్ నాగులపల్లి, ఆర్జే కాజల్, వీజే సన్నీ, ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్.. నామినేట్ అయ్యారు. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది హాట్‌ హాట్‌గా సాగింది.

 యానీ మాస్టర్- ఆర్జే కాజల్

యానీ మాస్టర్- ఆర్జే కాజల్

యానీ మాస్టర్-ఆర్జే కాజల్ మధ్య ఎప్పట్లాగే హీట్ డిబేట్ సాగింది. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. తొలుత ఆర్జే కాజల్.. యానీ మాస్టర్, సిరి హన్మంతులను నామినేట్ చేశారు. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారం.. వారి తల మీద ప్లైమ్‌ను పోశారు. ఈ సమయంలో కాజల్-యానీ మాస్టర్ మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. యానీ మాస్టర్ ఓ అడుగు ముందుకేసి డాన్స్ చేస్తూ వెక్కిరించారు.

యానీ మాస్టర్-మానస్

యానీ మాస్టర్-మానస్

మానస్ నాగులపల్లి కూడా యానీ మాస్టర్‌ను నామినేట్ చేశారు. హగ్ ఇష్యూ వారిద్దరి మధ్య వచ్చింది. మానస్.. యానీ మాస్టర్‌ను నామినేట్ చేయడం ఇదే తొలిసారి. ఇక యానీ మాస్టర్ టర్మ్ వచ్చిన తరువాత ఆమె తొలుత మానస్ నాగులపల్లిని నామినేట్ చేశారు. దానికి గల కారణాన్నీ వివరించారు. ఆమె చెప్పిన రీజన్‌కు మానస్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య డిబేట్ సాగింది. రెండో ఎలిమినేషన్ కింద యానీ మాస్టర్.. కాజల్‌ను సెలెక్ట్ చేశారు.

Recommended Video

    Bigg Boss Telugu 5: తగ్గని VJ Sunny క్రేజ్, ఇంతకీ అప్పడం అన్నాడా ? || Oneindia Telugu
     జెస్సీని తలచుకుంటూ డాన్స్..

    జెస్సీని తలచుకుంటూ డాన్స్..

    యానీ మాస్టర్-కాజల్ మధ్య మళ్లీ హాట్ డిబేట్ సాగింది. తాను దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. పట్టించుకోవట్లేదంటూ కాజల్ చెప్పిన కారణాన్ని యానీ మాస్టర్ రిజెక్ట్ చేయడం.. మళ్లీ మళ్లీ వెక్కరించడం కనిపించింది. వెక్కిరించడం తనకు ఇష్టం ఉండదంటూ కాజల్ చెబుతున్నప్పటికీ- యానీ మాస్టర్ అదే పని చేశారు. జెస్సీ మై బోయ్ అంటూ జశ్వంత్ పడాలను గుర్తు తెచ్చుకుంటూ డాన్స్ చేశారు. ఈ వారం వారిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది ఈ ఎపిసోడ్ చెప్పకనే చెప్పినట్టయింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+