Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే: టాప్-5లో ఉండేది వీళ్లే

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు వచ్చేసింది. ఇంకో వారమే మిగిలి ఉన్నాయి. అటు బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ వారం మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అయ్యారు. 14వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది.

 సరయు నుంచి..

సరయు నుంచి..

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత యానీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా టఫ్ కాంపిటీటర్‌గా భావించిన యాంకర్ రవి సైతం హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత- ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.. ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పుడు మిగిలింది ఆరు మందే. వారిలోనూ ఆదివారం రాత్రి మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

ఆ ఒక్కడు తప్ప..

ఆ ఒక్కడు తప్ప..

ఈ వారం అయిదు మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర మినహా మిగిలిన వారందరూ నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, వీజే సన్నీ నామినేట్ అయ్యారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లో సేఫ్, అన్‌సేఫ్ ప్రోగ్రామ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఉన్నది అయిదుమందే కావడం వల్ల ఆదివారం రాత్రే దీన్ని కంప్లీట్ చేస్తారని సమాచారం.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆర్జే కాజల్ అని తెలుస్తోంది. ఈ దఫా ఆమె పెర్‌ఫార్మెన్స్ ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా సాగిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్నాయి. టాస్కుల్లో ఆమె తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయారని అంటున్నారు. ఇన్నిరోజులు కొనసాగడమే గొప్ప అనే నెటిజన్లు, వీక్షకులు కూడా లేకపోలేదు. పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి కాజల్ తప్పుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారనే అంచనాలు ఉన్నాయి.

 టాప్-5లో ఉండేది వీరే..

టాప్-5లో ఉండేది వీరే..

కాజల్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే.. మిగిలిన అయిదుమంది చివరివారం వరకూ కొనసాగుతారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, వీజే సన్నీ టైటిల్ కోసం పోటీ పడతారు. టాప్-3లో ఎవరు ఉంటారనేది తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తోంది. టాప్-3లో మేల్ కంటెస్టెంట్సే ఉంటారనే టాక్ వినిపిస్తోంది. శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, వీజే సన్నీ, మానస్ నాగులపల్లి మధ్య టాప్-3 కోసం గట్టి పోటీ ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తోన్నారు.

 ఓట్ల పర్సెంటేజ్ ఇలా..

ఓట్ల పర్సెంటేజ్ ఇలా..

ఈ వారం ఓటింగ్ శాతంలో వీజే సన్నీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దుమ్ము దులుపుతున్నాడు. అతనికి పోల్ అయిన ఓట్లు 34,453. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తం పడిన ఓట్లల్లో సన్నీకి దక్కినవి 33.82 శాతం. రెండో స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. అతనికి 26.76 శాతంతో 27,259 ఓట్లు పడ్డాయి. సిరి హన్మంతుకు 15.79 శాతంతో 16,082 ఓట్లు పోల్ అయ్యాయి. మానస్‌కు 11.82 శాతంతో 12,039 ఓట్లు రాగా.. కాజల్ చివరి స్థానంలో నిలిచాడు. ఆమెకు 11.80 శాతంతో 11,938 ఓట్లు పడ్డాయి.

ప్లేబ్యాక్ సింగర్ ట్రెండింగ్..

ప్లేబ్యాక్ సింగర్ ట్రెండింగ్..

కాగా- ఈ సాయంత్రం నుంచి శ్రీరామచంద్ర అభిమానులు.. ఆయన పేరును ట్రెండ్ చేస్తోన్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ మీద #SreeramaChandra అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. రాబోయేదే చివరి వారం కావడం వల్ల బిగ్ బాస్ హౌస్‌లో మరింత ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. టైటిల్ ఫైట్ కోసం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల మధ్య మరింత టఫ్ టాస్క్, క్లాష్ ఉండొచ్చు. టాప్-3లో చోటు దక్కించుకోవడానికి గట్టి పోటీ ఉంటుంది. ఫలితంగా ఈ వారం మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+