• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 5 Telugu finale: ఆ సెలెబ్రిటీకి రూ.50 లక్షలు మిస్: విన్నర్..ఫైర్ బ్రాండ్: పొజీషన్లు ఇవీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. ఫైనల్ స్టేజీకి చేరింది. ఈ సాయంత్రానికి ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. అది అఫీషియల్‌గా మాత్రమే. ఆల్‌రెడీ విన్నర్ ఎవరనేది తేలిపోయింది. అతని పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న అయిదు మందిలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది విషయంపైనా క్లారిటీ వచ్చేసింది. ఎవరి పొజీషన్ ఏమిటనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఈ టైటిల్ కోసం పోటీ పడ్డ 19 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ టైటిల్ వరిస్తుంది. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ఓ ప్లాట్ సొంతం అవుతుంది.

15 వారాల పాటు..

15 వారాల పాటు..

15 వారాల పాటు సాగిందీ బిగ్‌బాస్ సీజన్. ఇంకొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలె ఆరంభమౌతుంది. ఈ సాయంత్రం 6 గంటలకు ఫినాలె ఉంటుంది. అయిదు గంటల పాటు ఆటపాటలతో కొనసాగనుంది. అక్కినేని అందగాడు నాగార్జున.. హోస్ట్‌గా మెరుపులు మెరిపించడానికి రెడీ అవుతున్నాడు. డిఫరెంట్‌ లుక్‌తో కనిపించన్నాడీ టాలీవుడ్ మన్మధుడు. ఈ ఫినాలెకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అటెండ్ కానున్నాడు. 83 మూవీ ప్రమోషన్‌లో భాగంగా అతను ఈ డయాస్ మీదికి రానున్నాడు. త్రిపుల్ ఆర్ జోడీ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఆలియాభట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు.

విన్నర్ అతడే..

విన్నర్ అతడే..

బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్లలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వీజే సన్నీ.. ఈ సీజన్ విన్నర్‌గా నిలవడం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను తన టాలెంట్‌తో టాప్-5లో చోటు దక్కించుకోగలిగాడు. టాప్-3కీ చేరుకున్నాడు.. చివరికి గెలుపుటంచులను ముద్దాడబోతున్నాడు. ఇదివరకు విన్నర్లుగా నిలిచిన వారికి ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండేది. శివబాలాజీ, కౌశిక్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్.. వీరందరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకముందు నుంచే ప్రేక్షకులకు తెలుసు. వీజే సన్నీ.. వీరందరికీ డిఫరెంట్.

మచ్చా, డార్లింగ్..

మచ్చా, డార్లింగ్..

వీజే సన్నీ.. తన ఫైర్ బ్రాండ్‌తో యూత్‌ను ఆకట్టుకున్నాడనేది సోషల్ మీడియా టాక్. అతను తరచూ మచ్చా, డార్లింగ్ అనే పదాలను వాడటం యూత్‌కు మరింత దగ్గర చేసింది. ఫ్రెండ్స్ మధ్య చాలా సాధారణంగా వెలువడే పదాలివి. నేచురల్‌గా ఉండటం, బయట ఎలా ఉంటాడో.. బిగ్‌బాస్ హౌస్‌లోనూ అదే తరహాలో ప్రవర్తించడం అతనికి ప్లస్ పాయింట్ అయింది. అతని డ్రెస్సింగ్ స్టైల్ సైతం యూత్‌ను కట్టిపడేసింది.

ప్లేబ్యాక్ సింగర్‌ రన్నరప్..

ప్లేబ్యాక్ సింగర్‌ రన్నరప్..

ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచే అవకాశం ఉంది. వీజే సన్నీతో పోటీ పడుతూ ఓట్లను దక్కించుకున్నప్పటికీ.. అది అతణ్ని అధిగమించేలా ఉండట్లేదు. ఈ ఇద్దరి మధ్యా ఉన్న ఓట్ల తేడా చాలా తక్కువగా ఉందని అంచనా. శ్రీరామచంద్ర కొంత రిజర్వ్డ్‌గా కనిపించడం మైనస్ పాయింట్ అయిందనేది నెటిజన్ల అభిప్రాయం. ఇదివరకు సోనీ టీవీలో నిర్వహించిన ఇండియన్ ఐడల్ విన్నర్ అతను. పలు తెలుగు సినిమాలకూ పని చేశాడు. ఈ ఇమేజ్ అతనికి పెద్దగా హెల్ప్ కానట్టే. చివరి వరకూ నిలవగలిగాడు..తోటి కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇవ్వగలిగాడు.

మూడో స్థానంలో షణ్ముఖ్..

మూడో స్థానంలో షణ్ముఖ్..

టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్..మూడో స్థానంలో నిలుస్తాడని చెబుతున్నారు. షన్ను రెండోస్థానంలో ఉంటాడనే అంచనాలు మొదట్లో వ్యక్తం అయ్యాయి. దీనికి అనుగుణంగానే ఓటింగ్ శాతం కూడా కొనసాగింది. శనివారం రాత్రి వరకూ అతను రెండో స్థానంలోనే కనిపించాడు ఓటింగ్ పర్సంటేజ్‌లో. అనూహ్యంగా శ్రీరామచంద్ర ఈ స్థానానికి దూసుకొచ్చాడు.

రాత్రికి రాత్రే వారిద్దరి స్థానాలు తారుమారయ్యాయని అంటున్నారు. సిరి హన్మంతుతో ట్రాక్ నడిపించడం అతనికి మైనస్ పాయింట్‌గా మారిందనే వారూ లేకపోలేదు. షన్ను లవర్ దీప్తి సునయన.. క్యాంపెయిన్ చేసినా ఉపయోగం ఉండదనేలా ఈ సీజన్ రిజల్ట్స్ వెలువడుతాయని స్పష్టమౌతోంది.

English summary
Bigg Boss 5 Telugu Finale: Sunny Becomes Winner And Sreerama Becomes Runner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X