Bigg Boss 5 Telugu: హౌస్ ఎంటర్‌టైనర్ అవుట్: ఆ ల్యాడర్ ట్రెడీషన్‌కు బ్రేక్

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో మరో ఎలిమినేషన్‌ డే వచ్చేసింది. మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా వరుసగా తొలి మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. నాలుగో వారం దీనికి బ్రేక్ పడింది. ఫోర్త్ ఎలిమినేటర్‌గా నటరాజ్ మాస్టర్ నిలిచాడు. ఆ తరువాత వరుసగా మూడువారాల పాటు ఫిమేల్ కంటెస్ట్ంట్ ఈ షో నుంచి ఎవిక్ట్ అయ్యారు.

ఎలిమినేషన్ లిస్ట్‌లో

ఎలిమినేషన్ లిస్ట్‌లో

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ ఎలిమినేట్ అయ్యారు. వీక్షకులు వారిని పెద్దగా ఆదరించలేదు. ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. అలాంటి కంటెస్టెంట్ ఒకరు ఈ ఎనిమిదో వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ కానున్నారు. ఆ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది అధికారికంగా ఈ రాత్రికి తేలిపోతుంది. ఆ కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం ముందే లీక్ అయింది. ఈ వారం మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎవిక్ట్ అవుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

సేఫ్ జోన్‌లో ఎవరు?

సేఫ్ జోన్‌లో ఎవరు?

ఈ వారం ఆరు మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి, లోబో, సిరి హన్మంతు, మానస్ నాగులపల్లి, షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు కూడా సేఫ్‌జోన్‌లో లేరనే విషయం తెలిసిందే. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌ సందర్భంగా హోస్ట్ అక్కినేని నాగార్జున.. ఎవ్వరినీ సేవ్ చేయలేదు. ఆరుమందే కావడం వల్ల ఈ రాత్రికే డిసైడ్ చేస్తారు. ఈ ఆరుమందిలో ఎవరు హౌస్‌లో కంటిన్యూ అవుతారు?, ఎవరు బయటికి వెళ్తారనేది ఈ రాత్రికి తెలిసిపోతుంది.

ఆకట్టుకోలేకపోతోన్న లోబో..

ఆకట్టుకోలేకపోతోన్న లోబో..

సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ వారం లోబో.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. రెండువారాల కిందటే ఎలిమినేట్ అయ్యే వేటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు లోబో. బిగ్‌బాస్ హౌస్ నుంచి స్టేజీ మీదికి వచ్చి కూడా.. మళ్లీ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే గడిపారు. ఆ తరువాత మెయిన్ హౌస్‌లోకి వచ్చాడు. ఆ తరువాత కూడా పెద్దగా సత్తా చాటట్లేదు. వీక్షకులు ఆదరించేలా, భారీగా ఓట్లను గుమ్మరించేలా ఆలరించట్లేదు.

ఆ ట్రెడీషన్‌కు బ్రేక్ పడినట్టే..

ఆ ట్రెడీషన్‌కు బ్రేక్ పడినట్టే..

ఈ వారం లోబో ఎలిమినేషన్ దాదాపు ఖాయం కావడం వల్ల ఓ ట్రెడీషన్‌కు బ్రేక్ పడినట్టే. ఇప్పటిదాకా ఏడుమంది ఎలిమినేట్ కాగా.. వారిల్లో నటరాజ్ మాస్టర్ ఒక్కడే మేల్ కంటెస్టెంట్. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌ సందర్భంగా నిర్వహించిన స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్‌లో యానీ మాస్టర్ ఓ కామెంట్ చేశారు. తాను ల్యాడర్‌గా భావించిన వారందరూ ఎలిమినేట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ వారం ల్యాడర్‌గా సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోతాడేమోనంటూ నాగార్జున జోక్ చేశారు. ఆమె యాంకర్ రవిని ల్యాడర్‌గా సెలెక్ట్ చేశారు. అదే యాంకర్ రవి- ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండటాన్ని నాగార్జున ప్రస్తావించారు.

ఓటింగ్‌లో లీస్ట్‌లో..

ఓటింగ్‌లో లీస్ట్‌లో..

ఓటింగ్‌లో సిరి హన్మంతు, లోబో చిట్టచివరి స్థానాల్లో నిలిచారు. యాంకర్ ర‌వి, శ్రీరామచంద్ర, మాన‌స్‌ నాగుపల్లి, ష‌ణ్ముఖ్‌ జశ్వంత్‌ సేఫ్‌జోన్‌లోకి వెళ్తారు. చివరి సిరి హన్మంతు, లోబో నిలుస్తారు. వారిద్దరిలో లోబో ఎలిమినేట్ అవుతారని చెబుతున్నారు. లోబో కంటే కొంత ఫర్వాలేదనిపించేలా సిరి హన్మంతుకు ఓట్లు దక్కడంతో ఆమె హౌస్‌లో కంటిన్యూ అవుతారు. తన ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడట్లేదని, షణ్ముఖ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతోందనేది నెటిజన్ల ఒపీనియన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+