• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పే..కానీ: సిరితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన షణ్ముఖ్: దానికి ఆ పేరు: నాగార్జున ముందే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు వచ్చేసింది. 15వ వారంలోకి అడుగు పెట్టింది. ఇంకో వారమే మిగిలి ఉంది. వచ్చే వారం మెగా ఫైనల్స్ ఉండబోతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న అయిదుమంది ఫైనలిస్టులెవరో తేలిపోయింది. ఆదివారం రాత్రి నాటి ఎపిసోడ్ సందర్భంగా అధికారికంగా ఫైనలిస్టులను ఎంపిక చేశారు నిర్వాహకులు. ఈ అయిదుమందిలో ఎవరు విన్నర్‌గా నిలుస్తానేది హాట్ టాపిక్‌గా మారింది.

కాజల్ అవుట్..

కాజల్ అవుట్..

ఊహించినట్టే- 14వ వారంలో రేడియో జాకీ కాజల్ ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్‌లో చేరే అర్హతను సాధించలేకపోయారు. ఈ దఫా ఆమె పెర్‌ఫార్మెన్స్ ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా సాగింది. టాస్కుల్లో ఆమె తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయారు. ఇన్నిరోజులు కొనసాగడమే గొప్ప అనే నెటిజన్లు, వీక్షకులు కూడా లేకపోలేదు. కిందటి వారం పోల్ అయిన ఓట్ల శాతంలో కాజల్‌ లీస్ట్‌లో నిలిచారు. పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి కాజల్ తప్పుకొన్నారు.

టాప్ 5లో సన్నీ ఎంట్రీ..

టాప్ 5లో సన్నీ ఎంట్రీ..


టైటిల్ రేసులో నిలిచే తొలి అయిదుమంది ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. శ్రీరామచంద్ర రెండువారాల కిందటే ఫైనల్‌లో ఎంట్రీ అయ్యాడు. శనివారం నాడు రెండో ఫైనలిస్ట్‌గా వీజే సన్నీ నామినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో రెండో ఫైనలిస్ట్ అతనే. మిగిలిన ముగ్గురినీ ఎంపిక చేశారు. మూడో ఫైనలిస్ట్‌గా సిరి హన్మంతు సెలెక్ట్ అయ్యారు. ఆమె ఫొటోను ప్రింట్ చేసిన బ్యానర్‌ను వీజే సన్నీ రివీల్ చేశారు. నాలుగో ఫైనలిస్ట్‌గా షణ్ముఖ్ జశ్వంత్, ఆ తరువాత మానస్ నాగులపల్లి టాప్-5లో చోటు దక్కించుకోగలిగారు.

సిరి-షన్ను ట్రాక్‌పై

సిరి-షన్ను ట్రాక్‌పై

బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని వారాలుగా షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంతు చాలా క్లోజ్‌గా ఉంటోన్నారనేది బహిరంగ రహస్యం. చాలా ఎపిసోడ్స్‌లో ఇది స్పష్టమైంది కూడా. షన్ను వెంటే సిరి అన్నట్టుగా కనిపించారు వారిద్దరు. చాలా టాస్క్‌లల్లో వారిద్దరూ ఒకరినొకరు సపోర్టు చేసుకున్నారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లోనూ ఇదే కనిపించింది. ఉన్న ఆరు మందిలో ఎవరు.. ఏ స్థానంలో ఉండాలనే విషయంపై నిర్వహించిన హోస్ట్ అక్కినేని నాగార్జున నిర్వహించిన గేమ్‌లో సిరి హన్మంతు.. షణ్ముఖ్ జశ్వంత్‌ను సపోర్ట్ చేశారు.

జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?

జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?

షన్ను. చాలా సీరియస్‌గా అడుగుతున్నాను. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో.. జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?..అని నిలదీశాడు. ఊహించని విధంగా జెస్సీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు షణ్ముఖ్ బిత్తర చూపులు చూశాడు. అలాగే సిరిపై కూడా ఘాటుగా ప్రశ్నలను సంధించాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి ఎమోషనల్‌కు కనెక్టయిపోతున్నామా? అది కనెక్టయిపోతున్నామా? ఇది కనెక్టయిపోతున్నామా? అని చెప్పి పిచ్చెక్కిపోతున్నావ్. అవసరమా నీకు.. అని సూటిగా సిరిని ప్రశ్నించాడు జెస్సీ.

షన్ను ఇచ్చిన సమాధానం ఇదీ..

షన్ను ఇచ్చిన సమాధానం ఇదీ..


జెస్సీ అడిగిన ప్రశ్నలకు షన్ను క్లారిటీ ఇచ్చాడు. సిరితో ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని స్పష్టం చేశాడు. సిరితో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి బయట ఎవరు, ఏమనుకుంటున్నారనేది తనకు తెలియదని, వేరే జనాలు తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ఎలా రియాక్ట్ అవుతున్నారో అని నాలుగైదు వారాల నుంచి తాను ఊహించుకుంటున్నానని చెప్పాడు. ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్లిన తరువాత ఈ ఫీలింగ్ మరింత ఎక్కువైందని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shannu Slams Vj Sunny Fans || Oneindia Telugu
 నాగార్జునతోనూ..

నాగార్జునతోనూ..

షణ్ముఖ్ జశ్వంత్ వివరణ ఇచ్చే సమయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున జోక్యం చేసుకున్నారు. సిరితో ఉన్న రిలేషన్‌ గురించి ఒక్క ముక్కలో తేల్చేయాలని సూచించారు. దీనికి షన్ను రిప్లై ఇస్తూ తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. సిరి హన్మంతు కూడా దాదాపు ఇదే రకమైన రిప్లై ఇచ్చారు. తాను త్వరగా ఎమోషనల్ అయిపోతుంటానని, షన్నుతో స్నేహం మాత్రమే ఉందనీ చెప్పారు. షణ్ముఖ్ జశ్వంత్- ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యానర్‌ను సిరి రివీల్ చేయడం..సిరి హన్మంతు ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత- ఇప్పుడు హ్యాపీయా అంటూ అక్కినేని షన్నును ఉద్దేశించి చెప్పడం ట్విస్ట్.

English summary
Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth clarifies about the relationship with Siri during the last night episode
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X