• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss: రంగంలోకి లేడీ యాంకర్ - వైల్డ్ కార్డు ఎంట్రీ ఖాయమేనా : బల్లగుద్ది మరీ- సోషల్ మీడియాలో రచ్చ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

బిగ్ బాస్ -5 సీజన్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారాలు గడిచిపోతున్నాయి. వినోదం కోసం చూస్తుంటే కలహాలు ఏంటనే చర్చ ఒకటి నడుస్తోంది. టాస్కులు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. కొత్తదనం లోపిస్తోందనే అభిప్రాయం ఉంది. ఇక, ఎలినిమేషన్ల గురించి ఎప్పటికీ భిన్నాభిప్రాయలు కనిపించే అంశమే. ఇదే సమయంలో కంటెస్టెంట్స్ అభిమానులతో ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో చర్చ - రచ్చ రెండు సాగుతున్నాయి. హౌస్ లో ఒక స్థాయిలో ఒక వ్యక్తి వ్యక్తిత్వానికే మచ్చ తేచ్చే విధంగా మాటలు సాగుతున్నాయి.

ఈ కలహాలతో సాగుతున్న ఎపిసోడ్స్ కు ఇప్పుడ కొత్త కలర్ తెచ్చేందుకు ప్రయ్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా..త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోందంటూ కిద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు అది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. షో కు కొత్త జోష్ తేవటానికి ఒక లేడీ యాంకర్‌ను రంగంలోకి దింపుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం కొనసాగుతోంది. తాజాగా ఆ లేడీ యాంకర్‌ ఎవరో కాదు, విష్ణుప్రియ అని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. త్వరలో విష్ణుప్రియ బిగ్‌బాస్‌ షోలో అడుగు పెట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. సీజన్ 4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి హౌజ్‌ను ఎంటర్‌టెయిన్ చేసిన అవినాశ్ టాప్ కంటెస్టెంట్స్‌ వరకు కొనసాగిన విషయం తెలిసిందే.

Bigg Boss Telugu 5:Anchor Vishnu Priya to make a wild card entry into the hous

అయితే ఇది నిజమా కాదా అనేది మాత్రం ఎవరూ అధికారికంగా క్లారిటీ ఇవ్వటం లేదు. అసలు విష్ణు ప్రియ బిగ బాస్ లోకి వచ్చే ఛాన్స్ లేదనే వాదన ఒక వైపు వినిపిస్తోంది. మరో వైపు విష్ణు రావటమే ఈ షో లో అసలైన కొత్త ట్విస్టు అని మరో రకమైన ప్రచారమూ సాగుతోంది. అసలు విష్ణు ప్రియ పేరు తెర మీదకు రావటం.. దీని వెనుక చర్చ జరగటం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఎందుకంటే తనకు బిగ్‌బాస్‌ కాన్సెప్టే నచ్చదని ఎన్నోసార్లు బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది విష్ణుప్రియ.

Recommended Video

#BiggBosstelugu5 : హౌస్ లో ఇంట్రెస్టింగ్ టాస్క్.. Sriram, Hamida అదుర్స్ || Oneindia Telugu

ఎన్ని కోట్లు ఇస్తానన్నా, ఎన్ని సీజన్ల నుంచి పిలుపు వచ్చినా షోలో ఎంట్రీ ఇచ్చేదే లేదని పలు సందర్భాల్లో విష్ణు చాలా క్లియర్ గా చెప్పేసింది. అలాంటిది విష్ణుప్రియ షోలోకి రావడం కేవలం ప్రచారమే అని అంటున్నారు ఆమె అభిమానులు. బిగ్‌బాస్‌ అంటేనే గిట్టదన్న విష్ణుప్రియ షోలో పాల్గొనే అవకాశమే లేదని బల్లగుద్ది చెప్తున్నారు.ఇదిలా ఉంటే యాంకర్ వర్షిణి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని షో ప్రారంభం కాకముందు ప్రచారం జరిగింది. ఎందుకంటే బిగ్‌బాస్ షో సీజన్ 5 ప్రారంభానికి ముందు వర్షిణి యాంకరింగ్ చేస్తున్న కొన్ని షోలలో కనిపించలేదు. దీంతో వర్షిణి బిగ్‌బాస్ ఎంట్రీ ఖాయమనే వార్తలకు బలం చేకూరింది. తీరా షో స్టార్ట్ అయ్యాక వర్షణి లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వర్షిణి పేరు కూడా వినిపిస్తోంది.

మరి నిజంగానే విష్ణుప్రియ గతంలో చెప్పిన విధంగా బిగ్ బాస్ కు దూరంగా ఉంటందా.. లేదంటే కళ్లు చెదిరే ఆఫర్‌ ఇస్తే షోలో ఎంట్రీ ఇచ్చి కొత్త జోష్ తెస్తుందా అనేది ఇప్పుడు బిగ్ బాస్ వ్యూయర్స్ కు ఆసక్తి కర అంశంగా మారిపోయింది. ఒక వేళ విష్ణు ప్రియా కాకుంటే వర్షిణి ఎంట్రీ ఇచ్చి మెస్మరైజ్ చేస్తుందా అనేది వేచిచూడాల్సి ఉంది.

English summary
News is making rounds that Anchor VishnuPriya will be induced into the Bigg Boss house Telugu season -5 on a wild card entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X