• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BIG BOSS-5 ఫినాలే లో స్టార్ల జాతర : ఫైవ్ మంచ్ ఫన్-ఊర నాటు పాట-ఆట అదరహో ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఇప్పుడు తెలుగు నాట బిగ్ బాస్-5 మేనియా కొనసాగుతోంది. గ్రాండ్ ఫినాలేలో అయిదుగురు కంటెస్టెంట్స్ ఉన్నా.. ఫైనల్ విన్నర్ ఎవరనేది ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. విన్నర్ - రన్నర్ తో పాటుగా ఎవరి ప్లేస్ ఏంటనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, విన్నర్ ఎవరనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ...ఫినాలే లో అతిధులు ఎవరనే దాని పైన కొంత కాలంగా అనేక మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రాజమౌళి తో సహా బాలీవుడ్ ప్రముఖులు వస్తున్నారంటూ పలువురి పేర్లు వైరల్ అయ్యాయి.

నెక్స్ట్ లెవెల్ ఎంటర్ టైన్ మెంట్

ఇక, ఈ సాయంత్రం ఫినాలే లో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రోమో విడుదల చేసారు. హోస్టు నాగార్జున తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు సిద్దమైపోయారు. నాలుగు గంటల ఆనందాన్ని మిస్ అవ్వద్దనే విధంగా ఈ ప్రోగ్రాం సిద్దం చేసారు. ఇక హౌస్ మేట్స్ తో "టునైట్ మీరు స్టార్స్ కానీ... మీరు చాలామంది స్టార్స్ ని చూడబోతున్నారు" అని చెప్పగా, హౌజ్ లోకి ఈరోజే రాత్రి ఎవరెవరు గెస్టులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయంపై ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశారు.

రాజమౌళి పంచ్ లు...అదిరిపోయే డైలాగులు

రాజమౌళి పంచ్ లు...అదిరిపోయే డైలాగులు

బ్రహ్మాస్త్ర టీంతో కలిసి రాజమౌళి, 'పుష్ప' టీం, 'శ్యామ్ సింగ రాయ్' బృందం, 'పరంపర' మూవీ స్టార్స్ చేసిన సందడితో 'బిగ్ బాస్-5' వేదిక స్టార్స్ తో వెలిగిపోయింది. ఇక హౌజ్ మేట్స్ తో రాజమౌళి ఫన్, 'శ్యామ్ సింగ రాయ్' బ్యూటీలతో నాగార్జున పంచులు, శ్రియ స్పెషల్ డ్యాన్స్, 'ఊ అంటావా' సాంగ్ కు హీరోయిన్ అదిరిపోయే డ్యాన్స్, ఇంకా మాజీ హౌజ్ మేట్స్ తో పాటు గత సీజన్ల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే రచ్చ ప్రోమోలో చూపించారు. ముందుగా రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుకుమార్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, సాయి పల్లవి, నాని అతిథులుగా విచ్చేశారు.

ఆర్ఆర్ఆర్ ఊర నాటు పాట..స్టెప్పులు

ఆర్ఆర్ఆర్ ఊర నాటు పాట..స్టెప్పులు

అలియా భట్ 'దబిడిదిబిడే' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పగా, రష్మిక 'సామి సామీ' స్టెప్పుతో అదరగొట్టేసింది. నాగార్జున ఆ స్టెప్పు సుకుమార్ తో వేయిస్తే ఎలా ఉంటుందని అడగడంతో ఒక్క సారిగా సుకుమార్ తో సహా నవ్వులు కురిపించాయి. ఇక, ఆర్ఆర్ఆర్ సంచలన సాంగ్ ఊర నాటు స్టెప్పులతో హోరెత్తించారు. రాహుల్ సింప్లిగంజ్ 'నాటు నాటు' సాంగ్ ను పాడగా, దానికి యాని మాస్టర్, నటరాజ్ మాస్టర్ కలిసి స్టెప్పులు వేసారు. ఇక, ఆర్ఆర్ఆర్ మూవీ పైన రాజమౌళితో కలిసి వేసిన పంచ్ లు బాగా పేలాయి.

ఫైవ్ మంచ్ ఫన్

ఫైవ్ మంచ్ ఫన్

ఇక, సందడికి సమయం దగ్గర పడుతోంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ స్పెషల్ ఫెస్టివల్ రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. స్టార్ ఎంటర్ టైన్ మెంట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో విన్నర్ ఎనౌన్స్ మెంట్ పైనా సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తి పెరిగిపోతోంది. ఇక, సోషల్ మీడియాలో ఇప్పుడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పైన పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది.

English summary
Bigg Boss Telugu season -5 will witness huge bunch of celebrities from both bollywood and Tollywood. It includes the Ace director SS Rajamouli and Bollywood throbe Ranbir Kapoor to Nani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X