Bigg Boss 5 Telugu finale: బిగ్ లీక్: టైటిల్ అతనిదే: ఫిక్స్ అయిన దానికి ఫినాలె ఎందుకన్నట్టు?

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కీలక దశకు చేరుకుంది. ఒక్క రోజే మిగిలి ఉంది. ఆదివారం నాటితో ఈ సీజన్ ముగుస్తుంది. సాయంత్రానికి ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఒక్కరోజే మిగిలివుండటం వల్ల బిగ్‌బాస్ మేనియా కమ్ముకుంటోంది. ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న అయిదు మందిలో విజేత ఎవరనే విషయం మీద హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి. ఈ టైటిల్ కోసం పోటీ పడ్డ 19 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ టైటిల్ వరిస్తుంది. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ఓ ప్లాట్ సొంతం అవుతుంది.

టాప్-5లో టాపర్‌గా..

టాప్-5లో టాపర్‌గా..

ఈ సీజన్‌లో బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి కంటెస్టెంట్లు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. తమ టాలెంట్ మొత్తాన్నీ ప్రదర్శించేస్తోన్నారు. వ్యూవర్స్‌ను ఆకట్టు కోవడానికి ఎవరి గేమ్ ప్లాన్‌తో వారు ఆడుతున్నారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, వీజే సన్నీ మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ ముగ్గురిలో ఒకరు విన్నర్‌గా నిలుస్తాడు. ఆ ఒక్కడు ఎవరనేది ఆదివారం రాత్రి నాటికి అధికారికంగా తేలిపోతుంది. శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, వీజే సన్నీ టాప్ 3లోకి రావడం దాదాపు ఖాయమైంది.

సగానికి పైగా ఓట్లు

సగానికి పైగా ఓట్లు

ఈ వారం ఓటింగ్‌లో వీజే సన్నీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. రెండోస్థానంలో ఉన్న కంటెస్టెంట్‌తో కంపేర్ చేసి చూస్తే..ఓట్ల మధ్య తేడా భారీగా ఉంటోంది. 10 వేలకు పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఓటింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మరిన్ని ఓట్లు పోల్ కానున్నందున.. పొజీషన్లు తారుమారు కావనే గ్యారంటీ లేదు. గ్రాండ్ ఫినాలె దగ్గరకు సమీపిస్తోన్న కొద్దీ టాప్‌లో ఉన్న సన్నీకి పడుతోన్న ఓట్ల సంఖ్య మరింత పెరుగుతోంది. రెండో స్థానంలో ఉన్న షన్నుకు అందనంత ఎత్తుకు చేరుకున్నాడీ డాషింగ్ కంటెస్టెంట్.

టఫ్ ఫైట్ ఈ ముగ్గురి మధ్యే..

టఫ్ ఫైట్ ఈ ముగ్గురి మధ్యే..

వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, శ్రీరామచంద్ర.. టాప్‌-3లో నిలిచారు. మానస్, సిరికి పడ్డ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ముగ్గురిని దాటుకుని టాప్‌లోకి రావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. వీజే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. గ్రాండ్ ఫినాలె గడువు సమీపించే సమయానికి ఈ ముగ్గురి ఓట్ల సంఖ్య మరింత పెరగడం ఖాయం. అది టఫ్ ఫైట్‌కు దారి తీయవచ్చు. ఇప్పుడున్న ఓట్ల ట్రెండింగ్ ఇలాగే కొనసాగితే.. బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ విన్నర్‌గా వీజే సన్నీ ఆవిర్భవిస్తాడు. అతడి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.

ఇవ్వాళ్టి ఓట్ల శాతం ఇలా..

ఇవ్వాళ్టి ఓట్ల శాతం ఇలా..

ఇప్పుడున్న ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే.. వీజే సన్నీ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోన్నాడు. అతనికి పోల్ అయిన ఓట్లు 55,241. మొత్తం పడిన ఓట్లల్లో సన్నీకి దక్కినవి 52.39 శాతం. రెండో స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. అతనికి పడ్డ ఓట్ల శాతం 32.30. మొత్తంగా 34,057 ఓట్లు పడ్డాయి. శ్రీరామచంద్ర మూడో స్థానంలో ఉన్నాడు. అతనికి 10,101 ఓట్లు పోల్ అయ్యాయి. 9.58 శాతం మంది అతనికి అనుకూలంగా ఓటు వేశారు. చివరి రెండు స్థానాల్లో మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు నిలిచారు. మానస్-3.35 శాతం ఓట్లతో 3,537, సిరి-2.38 శాతం ఓట్లతో 2,506 ఓట్లను సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+