ప్రధాని మోడీపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, బీజేపీ ప్రగతి భవన్ ముట్టడి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర పదజాలం వాడుతున్నారని చెబుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ప్రగతి భవన్‌ను ముట్టడించారు.
చిక్కడపల్లిలోని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పోలీసులు లక్ష్మణ్ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు.

ప్రగతి భవన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. వివిధ మార్గాల ద్వారా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications