తెలంగాణ బీజేపీ రెండో జాబితా సిద్దం - లిస్టులో ఎవరెవరు..!!

లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ 9 మంది అభ్యర్దులను ప్రకటించింది. కాంగ్రెస్ నలుగురిని ఖరారు చేసింది. బీజేపీ దేశ వ్యాప్తంగా ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. రెండో జాబితా అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది.

తెలంగాణలో తొలి జాబితాలోనే తొమ్మిది మందిని పార్టీ ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్దుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలని బీజేపీ కోరుకుంటోంది. కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు గెలిపించటం సీఎం రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..రెండు పార్టీలు అభ్యర్దుల ఎంపిక నుంచి ప్రచారం పైన ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లో అభ్యర్దుల కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ముందుగానే తమ అభ్యర్దులను ప్రకటించి..ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది.

BJP Almost finalised the contesting candidates for Loksabha seats in Telangana

తాజాగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు నగేష్‌, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్‌, రాములు తనయుడు భరత్‌ టికెట్‌ దక్కించుకున్నారు. రెండో జాబితాలో..మహబూబ్‌నగర్‌: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి, మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి పేర్లు పరిశీలన లో ఉన్నాయి. ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్, మహబూబాబాద్: సీతారాం నాయక్, ఖమ్మం: జలగం వెంకట్రావు, నల్గొండ: శానం సైదిరెడ్డి, వరంగల్: కృష్ణ ప్రసాద్, పెద్దపల్లి: ఎస్. కుమార్ పేర్లు రేసులో ఉన్నాయి. ఈ రాత్రికి తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్న ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్దులను బీజేపీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+